Chiranjeevi: చిరంజీవి .. తన తరంలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ హీరోగా సత్తా చాటాడు. అంతేకాదు తెలుగు సినీ చరిత్రలో దాదాపు పాతికేళ్లు ఈయన నెంబర్ వన్ కథానకుడిగా సత్తా చాటారు. మధ్యలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి.. మళ్లీ ఆ వెంటనే ఎగ్జిట్ ఇచ్చారు.  మరికొన్ని గంటల్లో  చిరంజీవి 69 యేళ్లు నిండుతున్నాయి. ఈ సందర్బంగా అభిమానుల కోసం చిరంజీవి ‘విశ్వంభర’ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేయనున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమాకు సంబంధించి టీజర్ ను రేపు ఉదయం విడుదల చేయనున్నారు. ఇది ఒక నిమిషం ఉన్నట్టు సమాచారం. ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష, మీనాక్షి చౌదరి, ఆషికా రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మరోవైపు చిరంజీవి.. పాత చిత్రాలు ఇంద్ర, శంకర్ దాదా జిందాబాద్ సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రీ రిలీజ్ కాబోతున్న పలు థియేటర్స్ లో అడ్వాన్స్ బుకింగ్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.


మరి ఈ సినిమాలు మహేష్ బాబు ‘మురారి’ సినిమా కలెక్షన్స్ ను క్రాస్ చేస్తాయా లేదా అనేది చూడాలి. మరోవైపు చిరంజీవి నుంచి మరో  కొత్త సినిమాను ప్రకటించే అవకాశాలున్నాయి.  విశ్వంభర తర్వాత చిరు.. తన నెక్ట్స్ సినిమా ఎవరితో చేస్తున్నారనేది ఇప్పటికీ క్లారిటీ లేదు. రేపు ఈ విషయమై క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి.
 
మరోవైపు ఈ ఇయర్ మెగా ఫ్యామిలీకి ప్రత్యేకంగా అని చెప్పాలి. చిరుకు దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మ విభూషణ్’తో మన ప్రభుత్వం సత్కరించింది. అటు రామ్ చరణ్ .. గౌరవ డాక్టరేట్ అందుకోవడం మరో విశేషం. అటు పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన, టీడీపీ, బీజేపీ ఏపీలో అధికారంలోకి వచ్చింది. మరోవైపు పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యారు.


చిరంజీవి విశ్వంభర సినిమా విషయానికొస్తే.. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కిస్తున్నారు.  బింబిసార ఫేమ్ వశిష్ఠ డైరెక్ట్ చేస్తున్నాడు.  అంతేకాదు ఈ చిత్రానికి ఘరానా మొగుడు, ఆపద్భాంధవుడు,  ఎస్పీ పరశురాం సినిమాల తర్వాత  కీరవాణి చిరంజీవి సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ‘విశ్వంభర’ చిత్రం వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.


ఇదీ చదవండి: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..


ఇదీ చదవండి: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter