మూవీ రివ్యూ: విశ్వం (Viswam)


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నటీనటులు: గోపీచంద్, కావ్యథాపర్, కిక్ శ్యామ్, సునీల్, వెన్నెల కిషోర్, జిషు సేన్ గుప్తా, నరేష్, రాహుల్ రామకృష్ణ, పృథ్వీరాజ్, ప్రగతి త‌దిత‌రులు


ఎడిటర్: అమర్ రెడ్డి కుడుముల


సినిమాటోగ్రఫీ: KV గుహన్


సంగీతం: చైతన్ భరద్వాజ్


నిర్మాత: టీజీ విశ్వప్రసాద్, వేణు దోణేపూడి


దర్శకత్వం: శ్రీను వైట్ల ,


విడుదల తేది: 11-10-2024


శ్రీను వైట్ల, గోపీచంద్ ప్రస్తుతం ఇద్దరు ఫ్లాపులతో సతమతమవుతున్నారు. దీంతో వీళ్ల కాంబినేషన్ అనగానే ప్రేక్షకుల్లో తక్కువ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఒకవైపు హీరోకు.. మరోవైపు దర్శకుడికి ఈ సినిమా విజయం కీలకం. అలాంటి సమయంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..


కథ విషయానికి వస్తే..


సెంట్రల్ మినిస్టర్ (సుమన్) అతని తమ్ముడు (సునీల్) తో పాటు తీవ్రవాది (జిషు సేన్ గుప్తా) చంపుతారు.ఈ మర్డర్ చేస్తున్నపుడు  ఓ పాప చూస్తుంది.ఆ తరువాత ఆ పాపను చంపే ప్రయత్నం చేస్తుంటారు తీవ్రవాదులు. .ఈ క్రమంలో పాపను కాపాడేందకు గోపి (గోపీచంద్ ) ఎంట్రీ ఇస్తాడు. అతనికి  ఆ పాప కు వున్నా రిలేషన్ ఏంటి.. ? అసలు సెంట్రల్ మినిస్టర్ ను చంపడానికి మోటివ్ ఏమిటి..? అసలు  విశ్వం ఎందుకు గోపీగా పేరు మార్చుకున్నాడనేది తెలియాలంటే మూవీ చూడాలంసిందే..


కథనం, టెక్నికల్ విషయానికొస్తే..


శ్రీను వైట్ల.. విశ్వం సినిమాను తన పాత బ్లాక్ బస్టర్ సినిమాల నుంచి కథతో పాటు కొన్ని కామెడీ సీన్స్ రాసుకొని ఈ సినిమాను తెరకెక్కించాడు. ీ సినిమాలో ఎక్కువగా దూకుడు, సరిలేరు నీకెవ్వరు, వెంకీ సినిమాలోని ఛాయలు కనిపిస్తాయి. కామెడీ సన్నివేశాలు కూడా అదే తరహాలో రాసుకున్నాడు. అందులో కొంత మేర సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా పృథ్వీరాజ్ తో చేసిన కామెడీ సీన్స్ అక్కడక్కడ నవ్విస్తాయి. ముఖ్యంగా డ్రై ఫూట్స్ జోక్ బాగానే పేలింది. సెకాండాఫ్ లో వెన్నెల కిషోర్.. కామెడీ ఈ సినిమాకు ప్లస్. మొత్తంగా శ్రీను వైట్ల తన మార్క్ కామెడీతో ఈ సినిమాలో దేశ భక్తిని టచ్ చేసాడు.


హీరో ఫ్లాష్ బ్యాక్ లో అమర్ నాథ్ యాత్ర సందర్భంగా టెర్రిరిస్టుల చేతిలో కుటుంబాన్ని కోల్పోవడం.. ఆ తర్వాత ఓ ఆర్మీ అధికారి ఇంట్లో పెరిగి.. యాంటీ టెర్రిరిస్ట్ స్క్వాడ్ లో చేరి టెర్రిరిస్టుల అంతం చూస్తుంటాడు.  గత కొన్నేళ్లుగా మన దేశ ‘రా’ ఏజెంట్స్.. పాకిస్థాన్, ఇతర దేశాల్లో టెర్రిరిస్టులను మూడో కంటి వాడికి తెలియకుండా ఎలా అంతం చేస్తున్నారనేది ఈ సినిమాలో చూపించే ఎపిసోడ్స్ రొటిన్ గా ఉన్నాయి. మొత్తంగా తన స్నేహితుడు కూతరును టెర్రరిస్టులు చంపడానికి ప్రయత్నిస్తుంటే.. ఆమెను కాపాడే బాధ్యత తీసుకోవడం వంటివి మనకు బాడీగార్డ్ సినిమా గుర్తుకు తెస్తుంది. ఇలా ఓ పాపను హీరో కాపాడే లాంటి సినిమాలు గతంలో ఎన్నో తెరకెక్కాయి. మొత్తంగా గోపీచంద్ వంటి యాక్షన్ హీరోను మంచిగానే యూజ్ చేసుకున్నా.. అదే దూకుడు, సరిలేరు నీకెవ్వరు తరహాలో తన పాత సినిమాలనే మళ్లీ రీమేక్ చేసినట్టుగానే ఉంది.  మొత్తంగా ఈ సినిమాలో కామెడీ సీన్స్ ఓ మోస్తరుగా ఆకట్టునేలా రాసుకున్నాడు. ఓ టెర్రరిస్ట్ ఓ పాపను చంపడానికి ఇంత ప్రయత్నం చేయడం సిల్లీగా అనిపిస్తోంది. ఫస్ట్ హాఫ్ వరకు ఓ మోస్తరుగా ఉన్నా.. సెకండాఫ్ లో పూర్తిగా తడబడ్డాడు. హీరో ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఇంకాస్త బాగా రాసుకొని ఉండాల్సింది. అక్కడ హీరో తండ్రిని చంపడం పోకిరి సినిమాను గుర్తుకు తెస్తుంది. హీరోయిజం పండాలంటే విలనిజం పండాలి. కానీ ఇందులో విలన్ ను చూస్తే అంత క్రూరంగా అనిపించడు. యాక్షన్ సీన్స్ బాగున్నాయి.  మధ్య సన్నివేశాలు ఇంకాస్త క్రిస్పీగా రాసుకుంటే బాగుండేది. ఎడిటర్ తన కత్తెరకు ఎంతో పని ఉన్నా.. అది మరిచిపోయినట్టు కనిపిస్తుంది.  మొత్తంగా గోపీచంద్ తో శ్రీను వైట్ల చేసిన ఈ ప్రయత్నం విఫలమైందనే చెప్పాలి. ఈ సినిమాలో చైతన్ భరద్వాజ్  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ,నిర్మాణ విలువలు బాగున్నాయి.


ఇదీ చదవండి:  Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..


ఇదీ చదవండి:  Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..


నటీనటుల విషయానికొస్తే..


గోపీచంద్ తన మార్క్ యాక్షన్ కమ్ కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. కొన్ని యాక్షన్ సీన్స్ మాస్ ప్రేక్షలను మెప్పించేలా ఉన్నాయి.  కావ్య థాపర్ నటిగా కంటే గ్లామర్ డాల్ గానే తన అంగాంగ ప్రదర్శన కోసమే తీసుకున్నట్టు అనిపిస్తుంది. అందాల ఆరబోతలో ఎలాంటి మొహమాటం చూపించలేదు. సినిమా మొత్తం చిట్టి పొట్టి డ్రెస్ లతో  కాస్ట్యూమ్స్ విషయంలో నిర్మాతలకు డబ్బులు మిగిలినట్టే చెప్పాలి. విలన్ గా సునీల్, జిషు సేన్ గుప్తా అంతగా కనెక్ట్ కాలేదు. పృథ్వీ రాజ్, వెన్నెల కిషోర్ తన కామెడీతో చూసే ప్రేక్షకులకు రిలీఫ్ ఇచ్చారు.  మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.


ప్లస్ పాయింట్స్


గోపీచంద్ యాక్షన్


వెన్నెల కిషోర్,పృథ్వీ కామెడీ సీన్స్


నిర్మాణ విలువలు


మైనస్ పాయింట్స్


రొటీన్ స్టోరీ


సెకండాఫ్


ఎడిటింట్


పంచ్ లైన్.. ‘విశ్వం’.. ఆకట్టుకొని రొటిన్ కామెడీ యాక్షన్ డ్రామా..


రేటింగ్.. 2.25/5


ఇదీ చదవండి: Pawan Kalyan Second Daughter: పవన్ కళ్యాణ్ చిన్న కూతురును చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో..!


ఇదీ చదవండి: Devara Villain Saif: దేవర విలన్ బైరాకు వైయస్ఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter