VJ Sunny ATM Teaser : ఇంట్రెస్టింగ్గా జీ5 ఏటీఎం టీజర్..హైలెట్‌గా వీజే సన్నీ
VJ Sunny ATM Teaser వీజే సన్నీ హీరోగా నటించిన ఏటీఎం వెబ్ సిరీస్‌కు సంబంధించిన టీజర్ వచ్చింది. ఇందులో సుబ్బరాజు ప్రధాన పాత్రలో నటించాడు. ప్రస్తుతం ఈ టీజర్‌కు సంబంధించిన విజువల్స్ హైలెట్ అవుతున్నాయి.
VJ Sunny ATM Teaser హరీష్ శంకర్ రైటింగ్ స్టైల్, కామెడీ సెన్స్ అందరికీ నచ్చుతుంది. అయితే మొదటి సారి హరీష్ శంకర్ కొత్తగా ట్రై చేస్తున్నాడు. అది కూడా దిల్ రాజు ఆధ్వర్యంలో వెబ్ సిరీస్ కోసం హరీష్ శంకర్ ఏటీఎం అనే వెబ్ సిరీస్ కథను రాశాడు. ఇందులో వీజే సన్నీ హీరోగా నటించాడు. ఏటీఎం ట్రైలర్‌ను హరీష్ శంకర్ విడుదల చేశారు. ఈ వెబ్ సిరీస్‌కు సి చంద్రమోహన్ దర్శకత్వం వహించాడు. దోపిడీ నేపథ్యంలో సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్.. జనవరి 20 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది.
గణేష్ డైరక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ.. దోపిడీ జోనర్‌లో రాసే కథల్లో చాలా పొటెన్షియల్ ఉంటుందని అన్నాడు. సెట్టింగ్ కూడా ఎంతో రియలిస్టిక్‌గా ఉంటుందని తెలిపాడు. ఈ సీరీస్‌లో దొంగలు రొటీన్‌గా ఉండరని, వాళ్లల్లో ఓ ప్రత్యేకత ఉంటుందని చెప్పుకొచ్చాడు. వీజే సన్నీ ముఖ్య పాత్రను పోషించాడని అన్నాడు. స్లమ్ లైఫ్ మీద అతనికున్న ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుందని, నవాబ్ తరహా జీవితాన్ని కోరుకున్న అతను ఏం చేశాడనేది ఆసక్తికరంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు.
నలుగురు చిన్న దొంగల రోలర్ కోస్టరే ఈ సీరీస్ అని, ప్రాణాలతో బతికి ఉండాలంటే కొన్ని కోట్ల రూపాయలను దోపిడీ చేయాల్సిన పరిస్థితుల్లోకి నెట్టబడిన వాళ్ల కథే ఇదని నిర్మాత హర్షిత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ చిత్రంలో వీజే సన్నీ, కృష్ణ, రవిరాజ్, రాయల్ శ్రీ తదితరులు నటించారు.
ఇప్పుడు హరీష్ శంకర్ అయితే ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇన్నాళ్లు భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమా మీద పని చేసిన హరీష్ శంకర్.. ఇప్పుడు అదే టైటిల్‌ను కాస్త మార్చి ఉస్తాద్ భగత్ సింగ్ (తేరీ తెలుగు రీమేక్)గా తీయబోతోన్నాడని తెలుస్తోంది.
Also Read: Thala Ajith Family : అజిత్ ఫ్యామిలీ ఫోటోలు.. ఆయన కూతురు ఎలా ఉందో చూశారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి