VV Vinayak Planning a Movie as Hero Director and Producer: ప్రస్తుతానికి తెలుగు సినీ ప్రేక్షకుల టేస్ట్ మారిందనే వాదన వినిపిస్తోంది. ఇదివరకటిలాగా మూస  సినిమాలను రొటీన్ సినిమాలను వారు ఎంకరేజ్ చేయడం లేదు. గత కొన్నాళ్లుగా కనుక మనం చూసినట్లయితే రొటీన్ అనిపించుకున్న ఏ సినిమా కూడా హిట్ అయిన దాఖలాలు లేవు. ప్రస్తుతానికి ప్రేక్షకులందరూ కొత్తతనాన్ని కోరుకుంటున్నారు. ఈ సమయంలో రిస్క్ చేయడానికి సిద్ధమయ్యారు డైరెక్టర్ వీవీ వినాయక్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిజానికి వీవీ వినాయక్ అఖిల్ సినిమాతో భారీ డిజాస్టర్ అందుకున్నారు. తర్వాత ఖైదీ నెంబర్ 150 సినిమాతో ఒక మాదిరి హిట్ అందుకున్నా ఇంటిలిజెంట్ అనే సినిమాతో మరో డిజాస్టర్ అందుకుని ఇండస్ట్రీకి దూరం అయిపోయారు. ప్రస్తుతం ఆయన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా చత్రపతి సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఆ సినిమా ఎక్కడ వరకు వచ్చిందో? ఎప్పుడు విడుదలవుతుందో? క్లారిటీ లేదు .


కానీ తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు వీవీ వినాయక్ హీరోగా ఒక సినిమా త్వరలోనే ఆయన ప్రారంభిస్తున్నారని తెలుస్తోంది. ఆ సినిమాకు ఆయనే స్వయంగా డైరెక్షన్ చేస్తారని నిర్మాత కూడా ఆయనే అని తెలుస్తోంది. నిజానికి కొన్నాళ్ల క్రితం దిల్ రాజు బ్యానర్ లో శరభ అనే సినిమా తీసిన డైరెక్టర్ వీవీ వినాయక్ హీరోగా సీనయ్య అనే సినిమా లాంచ్ చేశాడు. ఈ సినిమా ప్రకటన కంటే ముందు భారీ బరువుతో కనిపించే వీవీ వినాయక్ సినిమా కోసమే బాగా బరువు కూడా తగ్గాడు.


తర్వాత కరోనా ఎంట్రీ ఇవ్వడంతో ఆ ప్రాజెక్టు పట్టాలెక్కకుండానే ఆగిపోయింది. ఇప్పుడు వీవీ వినాయక్ తాను స్వయంగా నిర్మిస్తూ హీరోగా ఒక సినిమా డైరెక్ట్ చేయడం అనేది ఆసక్తికరంగా మారింది. ప్రేక్షకులు రొటీన్ అనిపించిన సబ్జెక్ట్ లు, మెగాస్టార్ చిరంజీవి లాంటి బడా స్టార్ హీరోల సినిమాలే పక్కన పెడుతున్నారు. మరి ఇలాంటి సమయంలో వీవీ వినాయక్ రిస్క్ చేసి మరీ ఎందుకు ఇలా రంగంలోకి దిగుతున్నారు అనే విషయం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అనేది. 
Also Read: OTT Release: కార్తికేయ 2, బింబిసార ఓటీటీ విడుదలపై స్పందించిన జీ5!


Also Read: Akshara Singh Opens Up: స్టార్ హీరోయిన్ సెక్స్ వీడియో లీక్.. ఓపెన్ కామెంట్స్ చేసిన హీరోయిన్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి