Waltair Veerayya 12 Days Collections: ఈ సంక్రాంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి రవితేజతో కలిసి వాల్తేరు వీరయ్య అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాకి మొదటి ఆట నుంచి మంచి పాజిటివ్ టాక్ అయితే లభించింది. చిరంజీవికి తోడు రవితేజ కూడా తో దుమ్ము రేపడంతో ఈ సినిమా మీద వసూళ్ల వర్షం కురిసింది. దాదాపుగా 12 రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 12 రోజులకు గాను 98 కోట్ల 13 లక్షల షేర్, 159 కోట్ల 15 లక్షల గ్రాస్ వసూళ్లు లభించాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

12వ రోజు అంటే నిన్న కోటి 20 లక్షల షేర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో లభించింది. ఇక ఇప్పటి వరకు 12 రోజులకు గాను కర్ణాటక సహా మిగతా భారతదేశంలో ఏడు కోట్ల 60 లక్షలు, ఓవర్సీస్ లో 12 కోట్ల 62 లక్షలు వాల్తేరు వీరయ్య సినిమా వసూలు చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 12 రోజులకు గాను 118 కోట్ల 35 లక్షల షేర్, 202 కోట్ల 90 లక్షల గ్రాస్ వసూళ్లు రాబట్టింది.


ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 88 కోట్లకు జరిగితే బ్రేక్ ఈవెంట్ టార్గెట్ గా 89 కోట్లు నిర్ణయించారు. ఇప్పటికే ఆ టార్గెట్ పూర్తిచేసిన ఈ సినిమా 29 కోట్ల 35 లక్షల లాభాలు తెచ్చుకొని సూపర్ హిట్ స్టేటస్ దక్కించుకుంది. ఇక డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతిహాసన్ నటించగా రవితేజ సరసన కేథరిన్ థెరిసా నటించారు.


మెగాస్టార్ రవితేజతో కలిసి నటించిన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించగా ఆ బడ్జెట్ కి తగినట్లుగానే కలెక్షన్స్ కూడా వసూళ్ల వర్షంలో వచ్చి కురుస్తున్నాయి. అయితే ఈ రోజు నుంచి తెలుగు రాష్ట్రాలలో సైతం పఠాన్ సినిమా పెద్ద ఎత్తున రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఆ ఎఫెక్ట్ థియేటర్ల మీద పడి తద్వారా కలెక్షన్స్ మీద కూడా పడే అవకాశం ఉంది.


Also Read: Balakrishna Sorry: సారీ చెప్పడానికి రెడీగా లేని బాలయ్య.. విషెస్ చెప్పాడు కానీ?


Also Read: Nagachaitanya Movie: పరశురామ్ కి హ్యాండిచ్చిన నాగచైతన్య.. అసలు ఏమైందంటే?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook