Waltair Veerayya Copy Dialouge: 30 ఇయర్స్ పృధ్వి డైలాగ్ కాపీ కొట్టిన చిరు.. ఇదేందయ్యా ఇదీ!
Waltair Veerayya Copy Dialouge: మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న వాల్తేరు వీరయ్య సినిమా జనవరి 13వ తేదీన సంక్రాంతి సందర్భంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుండగా ఈ సినిమా ట్రైలర్ లో ఒక డైలాగ్ కాపీ కొట్టారని ప్రచారం జరుగుతోంది. ఆ వివరాలు
Waltair Veerayya Copy Dialouge From 30 years Prudhvi from Winner Movie: మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న వాల్తేరు వీరయ్య సినిమా జనవరి 13వ తేదీన సంక్రాంతి సందర్భంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా నటించగా డైరెక్టర్ బాబీ సినిమా తెరకెక్కించారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ స్టఫ్ సినిమా మీద అంచనాలను అమాంతం పెంచేస్తూ ఉండగా సినిమా గురించి అనేక విశేషాలు కూడా బయటకు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్ గురించిన వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. అసలు విషయం ఏమిటంటే ఈ సినిమా ట్రైలర్ లో మెగాస్టార్ చిరంజీవి నోటి వెంట ఒక రికార్డుల డైలాగ్ పలికించారు. ఈ డైలాగ్ లో రికార్డులలో తన పేరు ఉండడం కాదు రికార్డులకే తన పేరు మీద ఉంటాయి అంటూ ఆయన పలికిన డైలాగ్ హాట్ టాపిక్ అయింది.
అయితే ఈ డైలాగ్ కాపీ డైలాగ్ అని అంటున్నారు. గతంలో సాయి ధరంతేజ్ హీరోగా నటించిన విన్నర్ అనే సినిమాలో 30 ఇయర్స్ పృద్వి ఒక పోలీసు అధికారి పాతతో కనిపిస్తాడు. ఆయన పాత్ర చేత ఈ డైలాగ్ పలికించారని నెటిజన్లు గుర్తుపట్టి దాన్ని సోషల్ మీడియాలో కూడా షేర్ చేస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇప్పుడు బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా దర్శకుడు గోపీచంద్ మలినేని ఆ విన్నర్ సినిమాకు దర్శకుడిగా వ్యవహరించడమే.
అలాంటి సినిమా నుంచి ఇప్పుడు దానికి పోటీగా వస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా యూనిట్ ఆ డైలాగులే వాడడం ఇప్పుడు చర్చనీయాంశంగా ఆసక్తికరంగా మారింది. ఈ విషయాన్ని గుర్తించిన పలువురు ఇదేం కామెడీ రా బాబు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మరి దీని పై వాల్తేరు వీరయ్య యూనిట్ ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి మరి.
Also Read: Chiranjeevi on AP Govt: ఏపీ ప్రభుత్వ తీరుపై చిరు స్పందన.. పవన్ కళ్యాణ్ డైలాగ్ తో ఆసక్తికర కామెంట్లు!
Also Read: AP Govt Good News: 'వాల్తేరు-సింహారెడ్డి'లకి గుడ్ న్యూస్.. ఆ డైలాగ్ కు 5 రూపాయల ఫైన్?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook