AP Govt Good News: 'వాల్తేరు-సింహారెడ్డి'లకి గుడ్ న్యూస్.. ఆ డైలాగ్ కు 5 రూపాయల ఫైన్?

AP Govt Gives Permission : గాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య, నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాల టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే 

Written by - Chaganti Bhargav | Last Updated : Jan 11, 2023, 12:51 PM IST
AP Govt Good News: 'వాల్తేరు-సింహారెడ్డి'లకి గుడ్ న్యూస్.. ఆ డైలాగ్ కు 5 రూపాయల ఫైన్?

AP Govt Gives Permission to Hike Waltair Veerayya and Veera Simha Reddy Ticket Rates: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య, నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాలు సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకులకు ముందుకు రాబోతున్నారు. ముందుగా నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాతో జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా ఒకరోజు వ్యవధితో అంటే జనవరి 13వ తేదీన మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 

 అయితే ఈ రెండు సినిమాలను నిర్మించింది మైత్రి మూవీ మేకర్స్ సంస్థ కావడంతో ఈ సినిమాను కాస్త రేట్లు పెంచి అమ్ముకునేందుకు ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. ఈ సినిమాలను భారీ బడ్జెట్ తో నిర్మించి విడుదల చేస్తున్నాం కాబట్టి కొంతమేర సినిమా టికెట్ రేటు పెంచి అమ్ముకుంటామని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ కోరింది. అయితే 70 రూపాయల వరకు పెంచుకుని అమ్ముకుంటామని అనుమతి కోరగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 45 రూపాయల వరకు  మాత్రమే గరిష్టంగా పెంచుకుని అమ్ముకోవచ్చు అంటూ ఆదేశాలు జారీ చేసింది.

అయితే సోషల్ మీడియాలో మాత్రం మరో ప్రచారం జరుగుతుంది అదేమిటంటే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమాకి 25 రూపాయలు పెంచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, అదే బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాకి మాత్రం 20 రూపాయలు మాత్రమే పెంచుకోమని ఆదేశించిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. సినిమా ట్రైలర్లో నందమూరి బాలకృష్ణ పరోక్షంగా జగన్ ప్రభుత్వం మీద కామెంట్ చేసిన నేపథ్యంలోనే ఐదు రూపాయలు ఫైన్ విధించారు అంటూ సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి.

అయితే వాస్తవానికి రెండు సినిమాలకు 45 రూపాయలు పెంచుకొని అమ్ముకోవచ్చు అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమాని బాబీ డైరెక్ట్ చేయగా శృతిహాసన్, రవితేజ వంటి వారు కీలక పాత్రలలో కనిపించారు. మరోపక్క నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాని గోపీచంద్ మలినేని డైరెక్టు చేయగా శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. ఇక రెండు సినిమాలలో శృతిహాసన్ హీరోయిన్గా నటించడం గమనార్హం.

Also Read: Chiranjeevi on AP Govt: ఏపీ ప్రభుత్వ తీరుపై చిరు స్పందన.. పవన్ కళ్యాణ్ డైలాగ్ తో ఆసక్తికర కామెంట్లు!

Also Read: Sreemukhi Hot Photos: ఎల్లో కలర్ షార్ట్ డ్రెస్సులో రెచ్చిపోయిన శ్రీముఖి.. అందాలు చూడతరమా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News