ఈ ఏడాది 2023లో విడుదలైన రెండు అగ్ర హీరోల సినిమాలు సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ఒకటి బాలయ్య వీరసింహారెడ్డి అయితే మరొకటి మెగాస్టార్ చిరు వాల్తేరు వీరయ్య. వాల్తేరు వీరయ్య అయితే ఇంకా పూనకాలు లోడ్ చేస్తూనే ఉంది. ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌తో మరింత వేగం పుంజుకోనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాలయ్య నటించిన వీరసింహారెడ్డి ఇప్పటికే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఇప్పుడు వాల్తేరు వీరయ్య వంతు వచ్చింది. ఓ వైపు ధియేటర్‌లో కనకవర్షం కురిపిస్తూనే..ఓటీటీ స్ట్రీమింగ్ ప్రారంభమైంది. ఇవాళ్టి నుంచి అంటే ఫిబ్రవరి 27వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇటీవలి కాలంలో మెగాస్టార్ చిరంజీవికి ఇదే మేజర్ హిట్ అని చెప్పవచ్చు. ఆచార్య డిజాస్టర్‌గా నిలిస్తే..గాడ్ ఫాదర్ యావరేజ్‌గా ఆకట్టుకుంది. వాల్తేరు వీరయ్య మాత్రం పూనకాలు తెప్పిస్తోంది. జనవరి 13 వతేదీన సంక్రాంతి కానుకగా విడుదలైన వాల్తేరు వీరయ్య...భారీగా కలెక్షన్లు సాధించింది. 


బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతి హాసన్ నటించింది. ఈ సినిమాలో రవితేజ రోల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిరంజీవి-రవితేజల మధ్య తీసిన కొన్ని సీన్స్ సినిమాకే హైలైట్‌గా నిలిచాయి. ఇద్దరు మాస్ హీరోలతో సినిమా సూపర్ హిట్ అయిపోయింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందింది. థియేటర్ రిలీజ్‌లో ప్రతాపం చూపించిన వాల్తేరు వీరయ్య ఓటీటీలో ఎలాంటి హంగామా సృష్టిస్తుందో మరి.


ఈ సినిమాలో రవితేజ, చిరంజీవి మధ్య ఎవరూ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా కచ్చితమైన అవుట్ పుట్ లభించింది. ఇప్పటి వరకూ ధియేటర్ పూనకాలు రప్పించిన సినిమా ఇక ప్రతి ఇంట్లో పూనకాలు తెప్పించేందుకు సిద్ధమౌతోంది. 


Also read: Raashi Khanna Bold Photoshoot : తెగించేసిన రాశీ ఖన్నా.. అంతా ఓపెన్‌ చేసిన బ్యూటీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook