Waltair Veerayya Pre Release Business Vs Veera Simha Reddy Pre Release Business: మెగాస్టార్ చిరంజీవి స్టామినా గురించి ఎన్ని చెప్పినా తక్కువే. ఒక పక్క రాజకీయాల్లోకి వెళ్లి మళ్లీ సినిమాల్లోకి తిరిగి రారు అనుకుంటున తరుణంలో మళ్లీ రి ఎంట్రీ ఇస్తూ చేసిన ఖైదీ నెంబర్ 150 అనే సినిమా చేస్తే అది 100 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించి సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఆ తర్వాత ఆయన చేస్తున్న సినిమాలు ఎందుకో కానీ కాస్త నిరాశ పరుస్తున్నాయి. అది కాదనలేని వాస్తవం, సైరా నరసింహారెడ్డి ఆ తర్వాత ఆచార్య, ఇక ఇటీవల ఆయన చేసిన గాడ్ ఫాదర్ సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో కాస్త విఫలమయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవల వచ్చిన గాడ్ ఫాదర్ సినిమా పరవాలేదు అనిపించినా కలెక్షన్స్ విషయంలో మాత్రం అభిమానులు పెద్దగా సంతృప్తి పడిన దాఖలాలు లేవు. ఇక తాజాగా వాల్తేరు వీరయ్య సినిమాతో ఈ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్నా వాల్తేరు వీరయ్య సినిమాకు బిజినెస్ జరిగిపోయింది. డైరెక్టర్ బాబి ఈ సినిమాను తెరకెక్కించగా శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ మీద భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ పూర్తికాగా ఈ సినిమా బిజినెస్ సీడెడ్ ప్రాంతంలో 15 కోట్ల రూపాయలకు, ఆంధ్ర ప్రాంతంలో 42 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్టు చెబుతున్నారు.


నిజాం ప్రాంతంలో 22 కోట్ల రూపాయలు అమ్ముడుపోగా మొత్తం తెలుగు రాష్ట్రాల బిజినెస్ 79 కోట్లు అయినట్లు తెలుస్తోంది. ఇవి కాకుండా మిగతా భారతదేశం అంతా అలాగే ఓవర్సీస్ లో కలిపితే మరో పదహారు కోట్ల వరకు అవడంతో మొత్తం మీద 95 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో రవితేజ కూడా కీలకపాత్రలో నటిస్తూ ఉండడం, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తూ ఉండడంతో ఈ సినిమా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ బిజినెస్ 100 కోట్ల మార్కు అందుకోలేకపోవడం మాత్రం మెగా అభిమానులకు కాస్త నిరాశపరిచే విషయమే. అయితే బాలకృష్ణ సినిమాతో కంపేర్ చేస్తే మాత్రం వారు కాస్త ఆనంద పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.


ఇదే సంక్రాంతి సీజన్ కి నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా కూడా విడుదలవుతుంది. గోపీచంద్ మలినేని డైరెక్షన్లో శృతిహాసన్ హీరోయిన్ గా వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాని సంక్రాంతికే రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన హక్కులు కూడా మంచి రేటుకే అమ్ముడయ్యాయి. సీడెడ్ ప్రాంతంలో 12 కోట్ల రూపాయలుగా ఉండగా నైజాం ప్రాంతంలో 14 కోట్ల రూపాయలు పలికినట్లు తెలుస్తోంది. ఇక మిగతా ఆంధ్ర ప్రాంతం అంతా కలిపి 30 కోట్లు చేయడంతో ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలకు 56 కోట్ల రూపాయల మీద బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది.


ఇవి కాకుండా ఓవర్సీస్ అలాగే మిగతా భారతదేశం అంతా కలిపి 10 కోట్ల రూపాయల వరకు బిజినెస్ జరిగే అవకాశం ఉంది. అయితే ఈ డీల్స్ క్లోజ్ అవ్వలేదని అంటున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా 66 కోట్ల రూపాయలు మేర బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. మెగా అభిమానులు ఒకపక్క తమ సినిమా 100 కోట్ల బిజినెస్ చేయలేదు అని బాధపడుతూనే మరోపక్క పోటీగా విడుదలవుతున్న బాలకృష్ణ సినిమా 66 కోట్ల చేసిందని ఆనంద పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది.


ఇక్కడ కచ్చితంగా చిరంజీవి డామినేషన్ కనిపిస్తోందని ఖచ్చితంగా చిరంజీవి సినిమానే ముందు రిలీజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఎందుకంటే 66 కోట్ల రూపాయల మీద బిజినెస్ చేసిన సినిమాని ఆ వసూళ్లు తెప్పించుకోవడం పెద్ద విషయం కాదు కానీ సుమారు 100 కోట్ల రూపాయల మేర అమ్మిన సినిమా వసూళ్లు దక్కించుకోవడం కాస్త కష్టమైన విషయమే కాబట్టి వీరసింహారెడ్డి కంటే రెండు రోజులు ముందే వాల్తేరు వేరే సినిమా రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని ప్రచారం జరుగుతుంది. చూడాలి మరి ఏం జరగబోతోంది అనేది.


Also Read: Samantha Stardom: చైతూ, నాగార్జునలను చిత్తు చేసిన సమంత... తొక్కుకుంటూ పోవాలంటున్న ఫాన్స్!


Also Read: Bipasha Basu Baby Girl: పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన బిపాసా బసు.. కానీ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook