Bipasha Basu Baby Girl: పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన బిపాసా బసు.. కానీ?

Bipasha Basu Gave Birth : ఆగస్టు నెలలో తాను తల్లి కాబోతున్నట్టు ప్రకటించిన బిపాసా బసు ఎట్టకేలకు ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే 

Written by - Chaganti Bhargav | Last Updated : Nov 12, 2022, 03:40 PM IST
Bipasha Basu Baby Girl: పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన బిపాసా బసు.. కానీ?

Bipasha Basu Gave Birth to a Baby Girl: బాలీవుడ్ మూవీ లవర్స్ కు గుడ్ న్యూస్, ఇటీవలే  రణబీర్ కపూర్ మరియు అలియా భట్ ఒక అందమైన పాపకు జన్మనివ్వగా ఇప్పుడు మరో జంట శుభవార్త అందించింది. బి టౌన్‌లో గ్లామర్ జంటగా పిలుచుకునే బిపాసా బసు - కరణ్ సింగ్ గ్రోవర్ ఇంటికి మహా లక్ష్మి వచ్చింది. ఈ అందమైన జంట ఒక పాపకు జన్మనిచ్చారు. బాలీవుడ్ వర్గాల కథనాల మేరకు బిపాసా శనివారం ఉదయం ఒక కుమార్తెకు జన్మనిచ్చిందట.

పెళ్లయిన ఆరేళ్ల తర్వాత కరణ్, బిపాషా తల్లిదండ్రులు అయ్యారు. బిపాసా బసు ఆగస్టులో తన ప్రెగ్నెన్సీ గురించిన సమాచారాన్ని అభిమానులతో షేర్ చేసుకుంది. ఆ తరువాత కూడా ఈ జంట చాలాసార్లు గ్లామరస్ ఫోటోలు పంచుకున్నారు. బిపాసా చాలా బేబీ బంప్ ఫోటోషూట్‌లు, ఆమె ప్రెగ్నెన్సీకి సంబంధించిన కొన్ని వీడియోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చింది. కొన్ని నెలల క్రితం, బిపాసా బసు బాంబే టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు ఒక కుమార్తె కావాలని చెప్పగా ఇప్పుడు ఆమె కోరిక నిజమైంది.

బిపాసా బసు, కరణ్ సింగ్ గ్రోవర్ ల ప్రేమకథ 'ఎలోన్' సెట్స్‌లో మొదలై పెళ్లితో మరింత బలపయింది. తొలి సినిమా సెట్స్‌లోనే బిపాసాతో కరణ్‌కి సాన్నిహిత్యం పెరిగింది. కరణ్ 'ఎలోన్' షూటింగ్ సమయంలో జెన్నిఫర్ వింగెట్‌ను వివాహం చేసుకున్న సమయంలో బిపాసాతో ఎఫైర్ వార్తల నేపథ్యంలో కరణ్ - జెన్నిఫర్ మధ్య విభేదాలు వచ్చాయి. ఆ తర్వాత వారిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకోవడంతో కరణ్ 2016 లో బిపాసాను వివాహం చేసుకున్నారు.

పెళ్లయినప్పటి నుంచి బిపాసా ప్రెగ్నెంట్‌గా ఉందనే వార్తలు చాలాసార్లు వస్తునే ఉన్నా ఈ ఆగస్టులో సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తాను తల్లిని కాబోతున్నానని శుభవార్తను పంచుకుంది. ఇప్పుడు ఈ జంట జీవితంలోకి ఓ చిన్న అతిథి ప్రవేశించడంతో వారి ప్రపంచం మరింత అందంగా మారిందనే చెప్పాలి. ఇక ప్రస్తుతం ఈ జంట బిడ్డను చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి బిపాసా, కరణ్ తమ బిడ్డను అభిమానులకు ఎప్పుడు చూపిస్తారో చూడాలి మరి. 

Also Read: Allu Arjun Good Heart: మా బన్నీ బంగారం.. ఆ అమ్మాయికే కాదు.. డ్రైవర్ కు కూడా మరచిపోలేని సహాయం!

Also Read: Samantha Stardom: చైతూ, నాగార్జునలను చిత్తు చేసిన సమంత... తొక్కుకుంటూ పోవాలంటున్న ఫాన్స్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News