'కరోనా వైరస్' ప్రపంచంలోనే మొట్టమొదటగా సినిమా తీసి సంచలనం సృష్టించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. మరో వివాదానికి తెరలేపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిజానికి వివాదానికి కేరాఫ్ అడ్రస్ వర్మ. ఆయన తీసిన ప్రతి సినిమా వెనుక వివాదం కచ్చితంగా ఉంటుందన్నది జగమెరిగిన సత్యం. ఐతే తాజాగా 'కరోనా వైరస్'పై సినిమా తీశారు ఆర్జీవీ.  అన్ని సినిమాలకు ఉన్న విధంగానే దీనికీ ఓ వివాదం సృష్టించారు వర్మ. ఆయన వివాదం వెనుక పబ్లిసిటీ స్టంట్ దాగి ఉందన్న ప్రచారమూ లేకపోలేదు. ఐతే ఇప్పుడు తాజాగా ఆయన రేపిన వివాదం కూడా చిత్రం ప్రమోషన్ కోసం చేశారా..? అనేది తెలియాల్సి ఉంది. 


కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. వ్యాపార, వాణిజ్యాలు అన్నీ బంద్ అయ్యాయి. జనం ఇళ్ల నుంచి బయటకు రాకుండా నిబంధనలు విధించారు. ఇందుకు చిత్ర పరిశ్రమకు మినహాయింపు లేదు. చిత్ర పరిశ్రమలోనూ షూటింగ్ లు, థియేటర్లు అన్నీ బంద్ అయ్యాయి. ఐతే కరోనా వైరస్ సినిమాకు సంబంధించి ట్రెయిలర్ నిన్న విడుదల చేసిన తర్వాత వర్మ.. ఇవాళ (బుధవారం) ఉదయం ఓ ట్వీట్ చేశారు.  అదే ఇప్పుడు కొత్త వివాదానికి తెరలేపుతోంది.  


కరోనా వైరస్ చిత్రాన్ని లాక్ డౌన్ పీరియడ్ లో చిత్రీకరించామని ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఐతే ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ మార్గదర్శకాలు పాటించామని ట్విట్టర్ లో పేర్కొన్నారు. అంతే కాదు ఈశ్వర్, అల్లా, జీసస్, గవర్నమెంట్ పై ఒట్టేసి చెబుతున్నా.. అంటూ ఆయన రాయడం విశేషం.



జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..