Tamannaah-Vijay Varma: దాదాపు తెలుగులో అందరు హీరోలతో నటించిన హీరోయిన్ తమన్న. మనోజ్ హీరోగా చేసిన శ్రీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ హీరోయిన్ హ్యాపీ డేస్ సినిమాతో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. ఆ తరువాత సీనియర్ హీరోలు.. జూనియర్ హీరోలు అని తేడా లేకుండా దాదాపు అందరితో నటించింది. కాగా కొద్ది రోజుల నుంచి తెలుగు సినిమాలకు దూరంగా ఉంటూ హిందీ సినిమాలలో అలానే హిందీ వెబ్ సిరీస్ లో కూడా మెరిసింది ఈ మిల్కీ బ్యూటీ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక బాలీవుడ్ లో అడుగు పెట్టాక అక్కడ విజయవాడ మాతో ప్రేమలో కూడా పడిపోయింది.  ముందుగా వీరిద్దరి ప్రేమ రూమర్లు చక్కర్లు కొట్టడం, ఆ తరువాత వీరిద్దరూ కలిసి ముంబై వీధుల్లో షికార్లు కొట్టడంతో …ఆ ఫోటోలు తెగ వైరల్ కావడం చకచగా జరిగిపోయాయి. ఇక వీరిద్దరూ కలిసి అదే వెబ్ సిరీస్ అయినా లస్ట్ స్టోరీస్ 2 లో కొన్ని బోల్డ్ సీన్స్ లో నటించి మరింత పాపులర్ అయిపోయారు. కాగా ఇవన్నీ జరిగిన కొద్ది రోజులకి వీరి ప్రేమ వ్యవహారం పై వచ్చిన రూమర్స్ గురించి స్పందిస్తూ .. అవును మేము ప్రేమలో ఉన్నాం, డేటింగ్ చేస్తున్నాం అని అందరికీ క్లారిటీ ఇచ్చేశారు ఈ జంట.


కాగా ప్రస్తుతం తమ లవ్ లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న వీరిద్దరూ ఇప్పుడు మ్యారేజ్ లైఫ్ లోకి అడుగు పెట్టాలి అనుకుంటున్నారట. ఒకప్పటి సీనియర్ హీరోయిన్స్ అంతా కొంచెం లేట్ అయినా ప్రేమించి లేటెస్ట్ గా పెళ్లి చేసేసుకుంటున్నారు. తమన్నా వయసు హీరోయిన్ లకి ఇప్పటికే దాదాపు పెళ్లిళ్లు అయిపోయాయి. అందుకే ఇప్పుడు తమన్నా కూడా పెళ్లి వైపు మొగ్గు చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక దీనికి విజయ వర్మ కూడా ఒప్పుకోవటంతో త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్త గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. 


ప్రస్తుతం తమన్నా, విజయ్ వర్మ చేతిలో ఉన్న సినిమాల్లో సెట్స్ మీద ఉన్నవి పూర్తి అవ్వగానే వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో పెళ్లి చేసుకుంటారని బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. మరి ఈ విషయంలో నిజం ఏంటో తెలియాలి అంటే మరోసారి తమన్నా, విజయ్ వర్మ ఈ వార్తల గురించి స్పందించాలి.


Also Read: Unknown Facts About Chandra Mohan: చంద్రమోహన్ గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..ఆయనకు గుర్తింపు తెచ్చిన సినిమా ఇవే! 


Also Read:  Delhi Air Pollution: ఢిల్లీపై కరుణించిన ప్రకృతి, వర్షం కారణంగా పెరిగిన గాలి నాణ్యత


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.TwitterFacebook