Weeks after separation from Naga Chaitanya, Samantha Ruth Prabhu jets off to Rishikesh for a much needed vacation: వ్యక్తిగత కారణాల వల్ల హీరో నాగచైతన్యతో (Naga Chaitanya) విడాకుల తీసుకున్న సమంత (Samantha) కొన్నాళ్లు సోషల్ మీడియాలో కాస్త సైలెంట్ అయింది. ఎప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా సమంత కొంతకాలంగా పెద్దగా పోస్ట్స్ చేయడం లేదు. అయితే ఆ బాధ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుని మళ్లీ యాక్టివ్ అవుతోంది సమంత. తన స్నేహితురాలు, మోడల్ శిల్పా రెడ్డి (Shilpa Reddy) కుటుంబంతో సరదాసరదాగా గడుపుతోంది సమంత. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది సమంత.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం రిషికేశ్‌లో ( Rishikesh) అక్కడి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తోంది సామ్. అక్కడి ప్రకృతి రమణీయ దృశ్యాలను, పవిత్ర స్థలాలతో పాటు జంతువుల ఫోటోలను కెమెరాలో బంధించి... ఆ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లలో పోస్ట్ చేసింది సమంత.


Also Read : చెరువులో బోల్తా పడిన స్కూలు బస్సు..ఒక విద్యార్ధి మృతి,నలుగురికి గాయాలు (Video)


మొన్నటి వరకు బాధతో కూడిన, మూవీ ప్రమోషన్స్‌కు సంబంధించిన పోస్ట్స్‌ షేర్‌ చేసిన సామ్‌.. ఇప్పుడు పాజిటివ్‌ పోస్ట్స్ చేస్తోంది. ఫన్నీ వీడియోలను (funny videos) పంచుకుంటోంది సమంత. అలాగే తన స్నేహితురాలు, డిజైనర్‌, మోడల్‌ శిల్పా రెడ్డి కుటుంబంతో కలిసి టగ్‌ ఆఫ్‌ వార్‌ (Tug of War) గేమ్‌ ఆడిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది సామ్. ఫిట్‌నెస్‌ (Fitness) అంటే పడిచచ్చే, పోటీతత్వానికి మారుపేరులా నిలిచే ఫ్యామిలీతో ఇలాంటి ఆటలు అస్సలు ఆడకూడదూ.. అంతేకాదు.. మనం ఏ మాత్రం నెగ్గలేం సరికదా.. మనకు దెబ్బలు కూడా తగులుతాయి..అంటూ ఒక వీడియో పోస్ట్ చేసింది సమంత. 



కాగా నాగ చైతన్యతో (Naga Chaitanya) విడిపోయిన బాధ, ఒత్తిడిలో ఉన్న సమంతను దాని నుంచి బయట పడేసేందుకు శిల్పారెడ్డి తోడ్పడుతోందట. సామ్‌కు ప్రతి విషయంలో శిల్పారెడ్డి (Shilpa Reddy) తోడుగా నిలుస్తోందట.


ఇక విజయదశమి (Vijayadashami) రోజున తాను చేయనున్న ప్రాజెక్ట్‌లను సమంత ప్రకటించారు. మరి కొన్నిరోజుల్లోనే వాటి రెగ్యులర్‌ షూట్‌ ప్రారంభం కానుంది. ఇప్పుడున్న ఖాళీ సమయాన్ని సమంత ఇలా సద్వినియోగం చేసుకుంటున్నారు. తనకెంతో ఇష్టమైన వారితో సమయాన్ని గడుపుతున్నారు సామ్. సామ్‌-శిల్పా డెహ్రాడూన్‌, రిషికేశ్‌ (Rishikesh) ప్రాంతాల్లో సరదాగా గడుపుతున్నారు. డెహ్రాడూన్‌ అటవీ ప్రాంతాల్లో ట్రెక్కింగ్‌ చేస్తోన్న ఫొటోలను కూడా సమంత (Samantha) షేర్‌ చేశారు.


Also Read : Gandhi hospital Fire accident: గాంధీ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి