Srikakulam: చెరువులో బోల్తా పడిన స్కూలు బస్సు.. ఒక విద్యార్ధి మృతి, నలుగురికి గాయాలు (వీడియో)

శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల మండలం బడివానిపేట సమీపంలోని ప్రైవేటు స్కూల్ బస్సు అదుపుతప్పి చెరువులో బోల్తా పడింది. ఒక విద్యార్థి మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 20, 2021, 12:33 PM IST
  • చెరువులో బోల్తా పడిన స్కూల్ బస్సు
  • పలువురికి గాయాలు ఒక విద్యార్ధి మృతి
  • శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల మండలంలో జరిగిన ఘటన
Srikakulam: చెరువులో బోల్తా పడిన స్కూలు బస్సు.. ఒక విద్యార్ధి మృతి, నలుగురికి గాయాలు (వీడియో)

School Bus Falls Into Lake: ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల మండలం బడివానిపేట సమీపంలోని ప్రైవేటు స్కూల్ బస్సు అదుపుతప్పి చెరువులో బోల్తా పడింది. బస్సు బోల్తా పడటంతో బస్సు కింద పడిన ఒక విద్యార్థి అక్కడిక్కడే మృతి చెందాడు. మృతి మృతి చెందిన విద్యార్థి బడివానిపేటకు చెందిన 8 ఏళ్ల మైలపల్లి రాజుగా గుర్తించారు. 

ఒక్కసారిగా బస్సు బోల్తా పడటంతో అందులో ఉన్న పిల్లలు భయాందోళలకు గురయ్యారు. పిల్లల అరుపులు, కేకలతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చెరువులో పడిన ఒక విద్యార్థిని కాపాడిన స్థానికులు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మరో ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. 

Also Read: Buddha Venkanna Arrest:ఆంధ్రలో హైటెన్షన్...రోడ్లపై టీడీపీ నేత బుద్దా వెంకన్న కర్రలతో హంగామా

ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు, పిల్లల కుటుంబీకులు మరియు సమీప గ్రామ ప్రజలు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఘటన గురించి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు మరియు గాయపడ్డ పిల్లకు మంచి వైద్యం అందించాలని ఆదేశించారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x