Pragya Jaiswal gets trolled after Whisky promotion: వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన 'కంచె' సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. ఆ తర్వాత గుంటూరోడు, నక్షత్రం, జయ జానకి నాయక, ఆచారి అమెరికా యాత్ర లాంటి సినిమాలు చేసిన ఆమెకు సరైన బ్రేక్ రాలేదు. అందాలు ఆరబోసినా కూడా ఈ భామకు అదృష్టం మాత్రం కలిసి రాలేదు. అయితే మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, నందమూరి నటసింహం బాలకృష్ణ కాంబోలో వచ్చిన అఖండ సినిమా ద్వారా ప్రగ్యా మంచి సక్సెస్ అందుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ప్రగ్యా జైస్వాల్.. ఎప్పటికప్పుడు తన ఫోటో షూట్‌లకు సంబందించిన పిక్స్ షేర్ చేసుకుంటూ అభిమానులను అలరిస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా ప్రగ్యా పెట్టిన ఓ ఇన్‌స్టా పోస్ట్ ఆమెను ట్రోలింగ్‌కు గురిచేసింది. ఇంతకీ విషయం ఏంటంటే.. బ్లాక్ మినీలో క్లీవేజ్ డ్రస్ వేసుకున్న ప్రగ్యా ఓ ఫారిన్ బ్రాండ్ విస్కీని ప్రమోట్ చేశారు. 'ప్రపంచ నంబర్ 1 అయిన బోర్బన్‌కు యాడ్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. బాధ్యతాయుతంగా త్రాగండి. 25 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు వారు మాత్రమే' అని ప్రగ్యా ట్వీట్ చేశారు. 


ఈ ట్వీట్ చుసిన నెటిజన్లు ప్రగ్యా జైస్వాల్‌పై మండిపడుతున్నారు. కామెంట్ల రూపంలో ఆమెపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. 'ఈ సభ్యసమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టో' అని ఒకరు కామెంట్ చేయగా.. 'ఇలాంటి యాడ్ చేస్తావా?' అని ఇంకొకరు ట్వీట్ చేశారు.  డబ్బులు ఇస్తే.. ఏ యాడ్ అయినా చేస్తావా?, ప్రగ్యా ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? అంటూ బాలయ్యబాబు హీరోయిన్‌పై ట్రోల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రగ్యా ఎఫ్ 2 సినిమాలో కీలక పాత్ర చేస్తున్నారు. 


Also Read: Anasuya Bharadwaj: పండగంతా అనసూయలోనే కనిపిస్తోంది.. 'అబ్బ' ఎంత ముద్దుగా ఉందో!


Also Read: Vijay Beast: విజయ్ 'బీస్ట్'కి బ్రేకులేసిన మరో ప్రభుత్వం.. కారణం ఏంటంటే?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook