Chiranjeevi Hindi Debut: 150 కంటే ఎక్కువ సినిమాలలో నటించిన మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో.. ఎన్నో రీమేక్ సినిమాలు కూడా ఉన్నాయి. అందులో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. ఉదాహరణకి శంకర్ దాదా ఎంబిబిఎస్.. సినిమా కూడా హిందీ లో మున్నాభాయ్ ఎంబీబీఎస్ సినిమాకి రీమేక్. చిరు కమ్ బ్యాక్.. సినిమా ఖైదీ నెంబర్ 150 కూడా ఒక రీమేక్ సినిమానే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పుడు ఓటీటీలు వచ్చేసాక.. రీమేక్ ల హవా బాగా తగ్గిపోయింది. కానీ ఒకప్పుడు ప్రతి ఇండస్ట్రీలోనూ రీమేక్ల.. జోరు బాగానే కొనసాగేది. అయితే ఒకప్పుడు.. చిరంజీవి తన తోటి హీరో అయిన రాజశేఖర్ సినిమాని రీమేక్ చేయడం ఒక విశేషం. తెలుగులో రాజశేఖర్ హీరోగా నటించి బ్లాక్ బస్టర్ అయిన ఒక సినిమాని చిరంజీవి హిందీలో రీమేక్ చేశారు. అది అక్కడ ..చాలా పెద్ద హిట్ కూడా అయింది. 


రాజశేఖర్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్టైన సినిమాలలో ఒకటి.. అంకుశం. యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో రాజశేఖర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. అది ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందంటే చాలా కాలం పాటు.. రాజశేఖర్ ని అంకుశం రాజశేఖర్ అని పిలిచేవారు. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఆ సినిమాలో జీవిత హీరోయిన్ గా నటించారు. 


అదే సినిమాని చిరంజీవి హిందీలో ప్రతిభంద్ అనే టైటిల్ తో రీమేక్ చేశారు. రవి రాజా పినిశెట్టి.. దర్శకత్వంలో జుహీ చావ్లా హీరోయిన్ గా విడుదలైన ఈ సినిమా హిందీలో కూడా బ్లాక్ బస్టర్ అయింది. చిరంజీవికి హిందీలో అదే మొదటి సినిమా. తెలుగు హీరో మొదటి సినిమాతోనే హిందీలో బ్లాక్బస్టర్ అందుకోవడం అదే మొదటిసారి. ఆ ఘనత మన మెగాస్టార్ దే. 


ప్రస్తుతం చిరంజీవి మల్లిడి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర.. అనే సినిమాతో బిజీగా ఉన్నారు. త్రిష ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. స్టాలిన్ లో చిరంజీవి సరసన హీరోయిన్గా కనిపించిన త్రిష మళ్లీ ఇన్ని ఏళ్ల తర్వాత చిరు.. పక్కన కనిపించనుంది. ఈ సినిమా వచ్చే ఎడాది సంక్రాంతి సందర్భంగా విడుదలకి సిద్ధమవుతోంది.


Also Read: Tragic Incident: వరదలతో తెగిన అన్నాచెల్లెలి అనుబంధం.. మృతదేహాన్ని 5 కి మీ మోసుకెళ్లిన అన్నలు


Also Read: Youtubers Tirumala Prank: తిరుమల భక్తులతో యూట్యూబర్ల వికృత చేష్టలు.. భక్తుల మనోభావాలతో చెలగాటం


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి