బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టంట్స్‌లో తొలుత బిగ్ బాస్ హౌజ్‌లోకి ప్రవేశించిన 14 మంది కంటెస్టెంట్స్‌లో ఒకరు కట్టప్ప ఉన్నారని సూచించిన బిగ్ బాస్.. ఆ కట్టప్ప ఎవరో తెలుసుకోవాల్సిందిగా ఇంటి సభ్యులకు టాస్క్ ఇచ్చాడు. దీంతో ప్రస్తుతం కట్టప్ప ఎవరు ( Who is kattappa in bigg boss house) అనే విషయంపైనే ఆ 14 మంది కంటెస్టంట్స్ మధ్య తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఇప్పటికే బిగ్ బాస్ ఇంటి సభ్యుల్లో కట్టప్పగా ఎవరిపై అనుమానం ఉందో వాళ్ల పేరు ఒక పేపర్‌పై రాసి ఒక బాక్సులో వేయాల్సిందిగా ఇంటి సభ్యులకు ( Bigg Boss 4 Telugu contestants ) బిగ్ బాస్ సూచించాడు. ఆ టాస్క్‌లో చాలా మంది అఖిల్‌ కట్టప్ప అయ్యుంటాడనే అనుమానంతో అతడి పేరు రాసి బాక్సులో వేశారు. Also read : Gangavva funny dialogues: బిగ్ బాస్ హౌజ్‌లో గంగవ్వ చెప్పే ఫన్నీ డైలాగ్స్ వింటే కడుపుబ్బా నవ్వుకోవాల్సిందే


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదిలావుండగానే ఆ మరునాడైన 4వ రోజు.. అరియాన, సొహెల్‌ని కన్‌ఫెషన్ రూమ్‌కి పిలిచిన బిగ్ బాస్.. ఇంటి సభ్యుల దృష్టిలో కట్టప్ప ( Kattappa ) ఎవరో తెలుసుకోవాల్సిందిగా మరోసారి సూచించాడు. అందుకోసం మిగితా 14 మంది ఇంటి సభ్యులను ఒక్కొక్కరిగా పిలిచి అడగమన్నాడు. ఐతే సోహైల్, అరియానాలకు సమాధానం చెప్పడం ఇష్టం లేని కొంత మంది మాత్రం వాళ్ల సమాధానం నేరుగా బిగ్ బాస్‌కి చెప్తాం కాని వాళ్ళిద్దరికి చెప్పమని అన్నారు. ఇంకొంత మంది మాత్రం వాళ్లకి తోచిన సమాధానం చెప్పారు. Also read : Director Surya Kiran: బిగ్ బాస్ కంటెస్టెంట్ సూర్యకిరణ్‌ ఎవరో తెలుసా ?

Bigg Boss house లో కట్టప్ప ఎవరో తెలుసుకునే మరో ప్రయత్నంగా బిగ్ బాస్ మరో టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగానే గత సీజన్‌లో నామినేట్ చేసే ఇంటి సభ్యుల ముఖంపై స్టాంప్ వేసే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు కట్టప్ప ( Kattappa in bigg boss 4 Telugu show )  ఎవరో తెలుసుకునేందుకు తెరపైకి తీసుకువచ్చాడు. ఆ టాస్క్ ప్రకారం ఎవరినయితే కట్టప్పగా భావిస్తున్నారో వాళ్ల ముఖంపై కట్టప్ప అనే స్టాంప్‌ వేయాల్సి ఉంటుంది. అలా ఒకొక్కరుగా వచ్చి వాళ్లకి ఎవరిపై డౌట్ ఉందో వాళ్ళపై స్టాంప్ వేశారు. అలా కొంతమంది లాస్య, సూర్య కిరణ్, నోయల్‌పై వేశారు. Also read : Bigg Boss Telugu 4 contestant Gangavva: గంగవ్వ ఎవలు, బిగ్ బాస్ 4 షోలో‌కి ఎట్లొచ్చింది ?


ఐతే సింగర్ నోయల్ సీన్ ( Singer Noel sean ) వంతు వచ్చేటప్పటికి అతడు మాత్రం కట్టప్పగా మరొకరిని అనుమానించేందుకు తాను సిద్ధంగా లేనని తేల్చిచెప్పాడు. కట్టప్పగా వేరే వాళ్ల పేరు చెప్పి నేను ఎవరిని హర్ట్ చేయదల్చుకోలేదు.. ఎందుకంటే నేనే కట్టప్ప అని బదులిస్తూ జై మహిష్మతి అంటూ నోయల్ తన ముఖంపై తనే స్టాంప్ వేసుకున్నాడు. ఇదంతా చూస్తుంటే మీకు నోయలే కట్టప్ప అనే అనుమానం వస్తుంది కదా.. ఇంతకి నోయల్ చెప్పింది నిజమేనా కాదా అని తెలుసుకోవాలంటే బిగ్ బాస్ ఏం సమాధానం చెబుతాడో వేచిచూడాల్సిందే మరి. ఇదంతా ఇలా ఉండగా.. కంటెస్టంట్స్‌లో ఒకరైన గంగవ్వ ( Gangavva ) ఈ పరిణామాలన్నింటినీ ఓ కంట కనిపెడుతూ హౌజ్‌లో ఏం జరుగుతుందో అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. మధ్యమధ్యలో తన మాటలతో అందరినీ నవ్విస్తోంది. Also read : Bigg Boss Telugu Voting: బిగ్ బాస్ ఓటింగ్.. రెండు రకాలుగా ఓట్లు వేయవచ్చు 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYeR