Gangavva funny dialogues: బిగ్ బాస్ హౌజ్‌లో గంగవ్వ చెప్పే ఫన్నీ డైలాగ్స్ వింటే కడుపుబ్బా నవ్వుకోవాల్సిందే

Gangavva dialogues in Bigg Boss 4 Telugu: పల్లెలో పుట్టి, పెరిగి వ్యవసాయం పనులు చేసుకుంటూ జీవించే గంగవ్వ మై విలేజ్ షోతో పాపులర్ ( Gangavva's my village show ) అయిపోయింది. గంగవ్వ యూట్యూబ్ వీడియోలకు ( Gangavva youtube videos ) లక్షల మంది ఫాలోవర్స్‌ ఉండటం కూడా ఓ రికార్డే అనుకోవచ్చు. ఇప్పుడు బిగ్ బాస్‌లో కూడా గంగవ్వ తన మాటలతో అందరిని ఆకట్టుకుంటోంది.

Last Updated : Sep 11, 2020, 02:05 AM IST
  • బిగ్ బాస్ హౌజ్‌లో ఏం జరుగుతోంది ?
  • బిగ్ బాస్ హౌజ్‌లో గంగవ్వ ఎలా కలిసిపోయింది ?
  • గంగవ్వ కోసం బిగ్ బాస్ రియాలిటీ షో నిర్వాహకులు ఇస్తున్న స్పెషల్ ట్రీట్‌మెంట్ ఏంటిది ?
  • బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పగలబడి నవ్వేంత గొప్పగా గంగవ్వ ఏం చెబుతోంది ?
Gangavva funny dialogues: బిగ్ బాస్ హౌజ్‌లో గంగవ్వ చెప్పే ఫన్నీ డైలాగ్స్ వింటే కడుపుబ్బా నవ్వుకోవాల్సిందే

Gangavva dialogues in Bigg Boss 4 Telugu: పల్లెలో పుట్టి, పెరిగి వ్యవసాయం పనులు చేసుకుంటూ జీవించే గంగవ్వ మై విలేజ్ షోతో పాపులర్ ( Gangavva's my village show ) అయిపోయింది. గంగవ్వ యూట్యూబ్ వీడియోలకు ( Gangavva youtube videos ) లక్షల మంది ఫాలోవర్స్‌ ఉండటం కూడా ఓ రికార్డే అనుకోవచ్చు. ఇప్పుడు బిగ్ బాస్‌లో కూడా గంగవ్వ తన మాటలతో అందరిని ఆకట్టుకుంటోంది. Also read : Bigg Boss Telugu 4 contestant Gangavva: గంగవ్వ ఎవలు, బిగ్ బాస్ 4 షోలో‌కి ఎట్లొచ్చింది ? 

గంగవ్వకు వృద్ధాప్యం కారణంగా కింద కూడా కూర్చోవడం కుదరని పరిస్థితి. చూపు సైతం కాస్త మందగించింది. కానీ ఇప్పుడు గంగవ్వ బిగ్ బాస్‌లో స్పెషల్ కంటెస్టెంట్, ఎంత స్పెషల్ అంటే గంగవ్వ కోసం సపరేట్‌గా తన రూమ్‌లోనే వాష్ రూమ్ ఉండేంత. బిగ్ బాస్ అంటేనే ఏడుపులూ, అరుపులు, తోపులాటలు, ఒకరిని కిందకు లాగాలని మరొకరు చేసే వింత వింత ప్రయత్నాలు ఒకటేమిటి అన్నీ ఉంటాయి. కానీ మరి ఇవేవీ తెలియని గంగవ్వ ( Gangavva in Bigg boss 4 ) అక్కడ ఏం చేస్తుందా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. Also read : Gangavva in BB4: బిగ్ బాస్ రియాలిటీ షోలో గంగవ్వ డైలాగ్స్ కెవ్వు కేక 

మొదటిరోజు నామినేషన్లలోనే గంగవ్వను ( Gangavva elimination ) దాదాపుగా హౌజ్‌లో అందరూ బయటకు పంపేయాలని డిసైడ్ అయిపోయారు. ఎందుకంటే, ఆమె ఫాలోయింగ్ ముందు తమ ఆటలు సాగవు అని చెప్పకనే చెప్పారు. కానీ గంగవ్వ మాత్రం తనకు అటువంటి అవసరమే లేదన్నట్టు.. బిగ్ బాస్ హౌజ్‌లో ( Bigg Boss house ) మొదటి రోజు నామినేషన్స్ సందర్భంగా మాట్లాడుతూ.. 'ఆళ్లంతా మొన్ననే వచ్చిర్రు కదా ఉండనీయ్' అంటూ డైలాగ్ కొట్టి బిగ్ బాస్ హౌజ్ సభ్యుల మనసులతో పాటు ఆడియెన్స్ అందరి మనసులు గెల్చుకుంది. ఇక రెండో రోజు కరాటే కల్యాణిని 'హౌజ్‌ని పిచ్చాసుపత్రి లెక్క చేస్తున్నవ్' అంటూ కౌంటర్ ఇచ్చింది. Also read : Bigg Boss Telugu 4 Elimination: పాపం గంగవ్వ.. ఫస్ట్ వీక్ నామినేట్ అయ్యింది వీరే...

ఇప్పుడు గంగవ్వ ఇంట్లో ఉన్న వాళ్లందరి గురించి ఒక్క మాటలో తన ఒపీనియన్ చెప్పుకొచ్చింది. అందులో భాగంగానే దేత్తడి హారిక 'వంట రూమ్‌లకు పొలేదింక' అని అన్నది. అలాగే అభిజిత్ గురించి చెప్పమని అడగగా 'మంచిగనే ఉంటడు యాపిల్ తినుకుంట' అని సమాధానం ఇచ్చింది. అలాగే సోహెల్ గంగవ్వని చెయ్యి పట్టి తీసుకెళ్తుండగా 'యే పో నడువు నేను నడుత్తా' అన్నాదంట. దాని గురించి గంగవ్వ చెప్తూ ''నన్ను రొండు గండ్లు పొయిందాన్ని పట్టుకున్నట్టె పట్టుకున్నడు. అందుకే అట్లన్న'' అంటూ అమాయకత్వంతో గంగవ్వ చెప్పిన సమాధానం అందరినీ కడుపుబ్బా నవ్వించింది. Also read : Bigg Boss Telugu Voting: బిగ్ బాస్ ఓటింగ్.. రెండు రకాలుగా ఓట్లు వేయవచ్చు  

గంగవ్వ చెప్పే మాటలతో ( Gangavva jokes in Bigg Boss 4 ) హౌజ్‌లో ఉన్న వాళ్లంతా పగలబడి నవ్వారు. ఇదిలా ఉంటే గంగవ్వ ఈ వారం ఆడియన్స్ వేసే ఓట్లతో ( Gangavva votes ) ఎలిమినేషన్ నుండి తప్పించుకోగలదా చూడాలి మరి. ఐతే గంగవ్వపై అభిమానం ఉన్న వాళ్లు మాత్రం గంగవ్వకు ఎలా ఓటు వేయాలని ( How to vote for Gangavva ) గూగుల్ చేసి మరి తెలుసుకుంటున్నారు. దటీజ్ గంగవ్వ!! Also read : Chiranjeevi's tonsured head: చిరంజీవి గుండు లుక్ వెనుకున్న కథేంటి ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYeR

Trending News