బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్న పేరు సామ్ బాంబే (Sam Bombay). గోవా పోలీసులు అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా ఈ పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఇందుకు కారణం లేకపోలేదు. ఆయన మరెవరో కాదు బాలీవుడ్ హాట్ బాంబ్ పూనమ్ పాండే భర్త సామ్ బాంబే (Who is Poonam Pandey’s husband). పూనమ్ పాండే, సామ్ బాంబే కొంతకాలం రిలేషన్‌లో ఉన్నారు. గాఢమైన ప్రేమలో మునిగితేలిన పూనమ్ పాండే (Poonam Pandey), సామ్‌ బాంబే సెప్టెంబర్ 1న ముంబైలోని ఓ ప్రైవేట్ ఈవెంట్‌లో వివాహం చేసుకున్నారు.  



నటి పూనమ్ పాండే వివాహానికి (Poonam Pandey Wedding) ఇరు కుటుంబాల సభ్యులతో పాటు కేవలం కొందరు సన్నిహితులు, బంధువులు హాజరయ్యారు. అయినా విషయాన్ని గోప్యంగా ఉంచారు. దాదాపు పది రోజుల తర్వాత తన పెళ్లి విషయాన్ని హాట్ బ్యూటీ పూనమ్ పాండే వెల్లడించింది. షూటింగ్ కోసం దక్షిణ గోవాకు పూనమ్ పాండే, సామ్ బాంబే వెళ్లగా వారి మధ్య ఏదో వివాదం మొదలైంది. భర్త తనను వేధిస్తున్నాడని, తనపై దాడి చేశాడని నటి పూనమ్ పాండే ఇచ్చిన ఫిర్యాదు మేరకు గోవా పోలీసులు సామ్ బాంబేను మంగళవారం అరెస్ట్ చేశారు. 



నటి పూనమ్ పాండే భర్త ఎవరంటే....
సామ్ బాంబే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో పుట్టి పెరిగాడు. ఆయన వయసు 36 ఏళ్లు. సామ్ బాంబే ఓ యాడ్ ఫిల్మ్ మేకర్, ప్రొడ్యూసర్. సామ్ బాంబే యాడ్ ఫిల్మ్ తీస్తుంటాడు. కొన్ని యాడ్ ఫిల్మ్స్‌కు నిర్మాతగా వ్యవహరించాడు. స్టార్ సెలబ్రిటీలు అక్షయ్ కుమార్, అల్లు అర్జున్, రణబీర్ కపూర్, దీపికా పదుకొనే, జాక్వలైన్ ఫెర్నాండెజ్, తమన్నా, తదితరులతో ప్రాజెక్టులు చేసి నిరూపించుకున్నాడు సామ్ బాంబే.  విశాల్‌కు మద్రాస్ హైకోర్టు రూ.8 కోట్ల షాక్! 



 


భారత ప్రముఖ క్రికెటర్లతో సైతం పనిచేశాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌లకు యాడ్స్ చేసిన ఘనత సామ్ బాంబే సొంతం. వ్యాపార ప్రకటనలు చేయడంలోనూ దిట్ట. ఒప్పో, స్పార్క్స్, అమెజాన్ లాంటి కంపెనీలకు యాడ్స్ చేశాడు. బాలీవుడ్‌ ప్రముఖులతో ప్రాజెక్టులు చేయడంతో నటి పూనమ్ పాండేతో పరిచయం ఏర్పడి ప్రేమలో పడ్డాడు. కొంతకాలం ప్రేమించుకున్నాక.. ఈ సెప్టెంబర్ 1న పూనమ్ పాండే, సామ్ బాంబే వివాహం చేసుకున్నారు. భర్త సామ్ బాంబేపై పూనమ్ చేసిన ఆరోపణలు ఇంకా నిరూపణ కాలేదు. 


ఫొటో గ్యాలరీలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe