Who is Sohail Kathuria : చాలా కాలంగా జరుగుతున్న ప్రచారాన్ని ఎట్టకేలకు హన్సిక మోత్వాని బ్రేకులేసింది. చాలా కాలంగా ఆమె ఒక బిజినెస్ మాన్ ను పెళ్లి చేసుకోబోతోంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ రాగా ఎట్టకేలకు అదే విషయాన్ని ఆమె కన్ఫర్మ్ చేసింది.[[{"fid":"250937","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తన స్నేహితుడు సోహైల్ కతూరియాను తాను వివాహం చేసుకోబోతున్నానని ఆమె పేర్కొన్నారు. తన స్నేహితుడు సోహైల్ కతూరియా పారిస్ లోని ఈఫిల్ టవర్ దగ్గర తనను పెళ్లి చేసుకోమని ప్రపోజ్ చేశాడని ఇప్పటికీ ఎప్పటికీ ఆయనతోనే ఉంటానని హన్సిక మోత్వానీ పేర్కొన్నారు.[[{"fid":"250938","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


ఒకపక్క హన్సిక మొత్వాని అభిమానులు అందరూ షాక్ అవుతూనే అసలు ఎవరు ఈ సోహైల్ కతూరియా అంటూ అతని గురించి వెతుకులాట మొదలుపెట్టారు. ఇక అతని గురించి మేము తెలుసుకున్న సమాచారాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అందుతున్న సమాచారం మేరకు సోహైల్ కతూరియా ఒక బిజినెస్ మాన్. ఆయన బొంబాయి బేస్ తో వ్యాపారాలు చేస్తున్నారు.[[{"fid":"250939","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


సోహైల్ కతూరియా హన్సిక మోత్వానితో చాలా కాలంగా రిలేషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి 2020 నవంబర్లోనే వీరు వివాహం చేసుకోవాలని అనుకున్నారు కానీ పలు కారణాలతో ఆ ఏడాది కుదరలేదు. నిజానికి హన్సిక మొత్వాని సహాయం ఒక ఈవెంట్ ప్లానింగ్ సంస్థను నెలకొల్పారని ఇద్దరూ దానికి బిజినెస్ పార్ట్నర్లుగా ఉన్నారు అని తెలుస్తోంది.[[{"fid":"250940","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]


బిజినెస్ పార్టనర్లుగా ఉన్న తాము లైఫ్ పార్టనర్ గా మారాలని ఇద్దరు నిర్ణయించుకుని చాలా కాలమైందని ప్రచారం జరుగుతోంది. అంతేకాక వీరి వివాహం కూడా డెస్టి    నేషన్ వెడ్డింగ్ లా జరగబోతోంది. అందుతున్న సమాచారం మేరకు జైపూర్ లోని ముండోట ప్యాలెస్ లో ఈ వివాహం జరగబోతోంది.[[{"fid":"250941","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"5"}}]]


డిసెంబర్ రెండవ తేదీ నుంచి వీరి వివాహానికి సంబంధించిన పనులు ప్రారంభం కానుండగా నాలుగో తేదీన వీరి వివాహం జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ వివాహానికి సంబంధించిన అధికారిక సమాచారం అందాల్సి ఉంది.


Also Read: Pavala Shyamala : కరాటే కళ్యాణిపై పావలా శ్యామల షాకింగ్ కామెంట్స్.. అసహ్యం వేసిందంటూ!


Also Read: UV Creations GST Raids: ప్రభాస్ సొంత సంస్థపై జీఎస్టీ రైడ్స్.. టాలీవుడ్లో కలకలం!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook