మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్‌ని రిస్క్‌లో పెడుతున్నాడా అంటే సోషల్ మీడియాలో నెటిజెన్స్ నుంచి అవుననే టాక్ బలంగా వినిపిస్తోంది. అదేంటంటే.. చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ మొత్తం రీమేక్స్ మయం అవుతుండటం. ప్రస్తుతం చిరంజీవి టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నవంబర్ 9 నుంచే ఆచార్య షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. ఈ సినిమా తర్వాత చిరు మరో రెండు రీమేక్స్ కి సైన్ చేశారు. అందులో ఒకటి మళయాళంలో మోహన్ లాల్ చేసిన లూసిఫర్ కాగా మరొకటి తమిళంలో అజిత్ హీరోగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన వెదళం సినిమా. సరిగ్గా ఇదే అంశం ప్రస్తుతం చిరంజీవి అభిమానులకు ఆందోళనకు గురిచేస్తోందంట.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం చిరంజీవి చేతుల్లో ఉన్న మూడు సినిమాల్లో ఆచార్య ( Acharya movie ) ఒక్కటి మాత్రమే డైరెక్ట్ సినిమా. మిగతా రెండు చిత్రాల్లో ఒకటి కోలీవుడ్ నుంచి వెధళం ( Vedhalam telugu remake ) అయితే మరొకటి మాలీవుడ్ నుంచి వచ్చిన లూసిఫర్ రీమేక్ ( Lucifer telugu remake ). చిరంజీవి  దాదాపు దశాబ్ధకాలం తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సినిమా ఖైదీ నెంబర్ 150 కూడా కోలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన కత్తి సినిమాకు రీమేకే. ఆ తర్వాత చిరు చేసిన సైరా సినిమా కూడా ఒక చారిత్రక కథనమే. అంటే.. చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో సూపర్ హిట్ అయిన సినిమాలపైనే ఆధారపడ్డాడంటే.. మన తెలుగు దర్శకులు చెప్పిన కథలు నచ్చడం లేదా ? లేక వారి కథలపై నమ్మకం లేకనా ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అది కూడా కాదంటే.. తనపై తాను ఏదైనా అభద్రతా భావంతో ఉన్నారా అనేవాళ్లు కూడా లేకపోలేదు. 


Also read : Anchor Pradeep: యాంకర్ ప్రదీప్‌కి చిరంజీవి షాక్


ఏది ఏమైనా చిరంజీవి స్ట్రామినా ఏంటో అభిమానులు, ఆడియెన్స్‌కి తెలిసిన విషయమే. అందుకే ఆయన రీమేక్స్ గురించి ఆందోళన పడే వారి కంటే ఎక్కువగా.. ఆయన తల్చుకుంటే మరిన్ని స్ట్రెయిట్ సినిమాలు తీసి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టగలరనే నమ్మకం ఉన్న వాళ్లే ఎక్కువున్నారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.


మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి