Samantha Akkineni, Naga Chaitanya's marriage life: పెళ్లికి ముందు సమంత రూత్ ప్రభుగా ఉన్న తన పేరును పెళ్లి తర్వాత సమంత అక్కినేనిగా మార్చుకున్న సమంత ఇటీవలే తన పేరు చివరన అక్కినేని అనే సర్ నేమ్ తొలగించడం అటు ఇండస్ట్రీ వర్గాల్లో ఇటు అభిమానుల్లో తీవ్ర చర్చనియాంశమైంది. తన ఇంటిపేరు అక్కినేనిని తొలగించిన సమంత.. ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో డిస్‌ప్లే నేమ్‌ని 'ఎస్' అని పెట్టుకుంది. దీంతో సమంత, నాగచైతన్యల వివాహ బంధంలో (Samantha, Naga Chaitanya's marriage life) విభేదాలు పొడచూపాయా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. మీడియాలో తాటికాయంత అక్షరాలతో ఇదే అంశంపై అనేక కథనాలొచ్చాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సమంత అక్కినేని సర్‌నేమ్ (Actress Samantha surname) వివాదం మాత్రమే కాకుండా ది ఫ్యామిలీ మేన్ 2 వెబ్ సిరీస్ విషయంలోనూ సమంతపై విమర్శలొచ్చిన సంగతి తెలిసిందే. సమంత తొలిసారిగా నటించిన వెబ్ సిరీస్ ఇది. ఈ వెబ్ సిరీస్ (The Family Man 2 web series) విషయంలోనూ సమంతపై భారీ ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. తాజాగా ఈ రెండు వివాదాలపై ఓ మీడియా సంస్థతో సమంత మాట్లాడుతూ.. ఇలాంటి అంశాలపై తాను స్పందించదల్చుకోలేదు అని ఖరాఖండిగా తేల్చిచెప్పింది. మీడియాలో, సోషల్ మీడియాలో వచ్చే నాయిస్ గురించి తాను పెద్దగా పట్టించుకోను అని సమంత స్పష్టంచేసింది. 


Also read : HBD Pawan Kalyan: వ్యక్తిత్వానికి నిలువెత్తు నిదర్శనం.. అభిమానుల ఆరాధ్య దైవం!


పేరు చివరన అక్కినేని తొలగించిన తర్వాత నాగచైతన్యతో విభేదాలు వచ్చాయా అనే ప్రశ్నల నుంచి మొదులుకుని ది ఫ్యామిలీ మేన్ 2 వెబ్ సిరీస్ వరకు సోషల్ మీడియాలో ఎన్నో కథనాలు, రూమర్స్ వస్తూనే ఉన్నాయని సమంత (Actress Samantha Akkineni) ఒకింత అసహనం వ్యక్తంచేసింది.


Also read : Breaking News: చిన్నారి పెళ్లికూతురు సిరీయల్‌ హీరో "సిద్ధార్థ్ శుక్లా" హఠాన్మరణం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook