HBD Pawan Kalyan: వ్యక్తిత్వానికి నిలువెత్తు నిదర్శనం.. అభిమానుల ఆరాధ్య దైవం!

సెప్టెంబర్  2.. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు.. కోట్ల మంది అభిమానులు ఆయన సొంతం.. రాజకీయంలో, సినిమాల్లో రెండింటిలో తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ.. ఎంతో  మందికి ఆదర్శంగా నిలుస్తున్న పవన్ కళ్యాణ్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 2, 2021, 11:44 AM IST
  • పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు
  • సాధారణ జీవితం, అసాధారణ వ్యక్తిత్వం అయన సొంతం
  • వ్యవసాయం చేయటం, పుస్తకాలు చదవటం ఇష్టం
HBD Pawan Kalyan: వ్యక్తిత్వానికి నిలువెత్తు నిదర్శనం.. అభిమానుల ఆరాధ్య దైవం!

పవన్ కళ్యాణ్.... (Pawan Kalyan) ఈ పేరు తెలియని తెలుగు వాడు ఉండడేమో.. ఆ పేరు వింటే చాలు అభిమానుల్లో ఊపు, సినిమా విడుదలైతే చాలు థియేటర్లు దద్దరిల్లి పోవాల్సిందే. ఏ ఏ సినిమా తీసిన సరే ... హిట్ అయినా కాకపోయిన అభిమానుల సందడి ఏ మాత్రం తగ్గదు. మెగా కుటుంబం (Mega Faily) నుండి వచ్చిన పవన్ కళ్యాణ్ తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆకాశమంత అభిమానం సొంతం చేసుకోటానికి ముఖ్య కారణమా ఆయన వ్యక్తిత్వమే.. బర్త్ డే సందర్భంగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan Birthday Special Story) గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం.. 

పుస్తకాలంటే ఇష్టం...
పవన్ కళ్యాణ్ గారికి పుస్తకాలంటే ఎంత ఇష్టమో మన అందరికి తెలిసిందే.. షూటింగ్ సమయంలో కాస్త విరామం దొరికిన పుస్తకంలో లీనమైపోతారు. షూటింగ్ లో పుస్తకాలు చదువుతున్న ఫోటోలు వైరల్ అయిన విషయం మనకు తెలిసిందే. ఎక్కువగా సాహిత్యం ఉన్న పుస్తకాలు చదవటం ఇష్టపడే పవన్ కళ్యాణ్ తన అభిమానులు కూడా పుస్తక పఠనం చేయమని సలహా ఇస్తుంటారు. 

Also Read: Viral: వలలో చిక్కిన 'ఘోల్‌' చేపలు..ఒక్కరోజులో కోటీశ్వరుడైన జాలరి!

సాధారణ జీవితమే ఇష్టం... 
ఒకానొక సందర్భంలో పవన్ గురించి డైరెక్టర్ త్రివిక్రమ్‌ (Director Trivikram) చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుందాం.."కొన్ని చెట్లు.. పుస్తకాలు ఉంటే చాలు ప్రశాంతంగా బ్రతికేయగలడు". అవును పవన్ కళ్యాణ్ కలిసిన ప్రతి ఒక్కరు చెప్పేది ఇదే... కోట్లలో అభిమానులు.. ఒక్క సినిమా తీస్తే చాలు కోట్లలో వచ్చే ఆదాయంతో లక్సరీ  లైఫ్... కానీ పవన్ కళ్యాణ్ గారికి సాధారణ జీవితం గడపటం అంటేనే ఇష్టం. చెట్లు పెంచుతూ,  వ్యవసాయం చేస్తూ తనను తాను బిజీగా ఉండటానికి ప్రయత్నిస్తుంటారు. ఇలా ఆయన వ్యక్తిత్వాన్ని అభిమానులుగా మారి పోయిన మంది కోట్లలోనే ఉన్నారు.   

కోట్లలో అభిమానులు...
నిజానికి పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలలో కొన్ని మాత్రమే సూపర్ హిట్ గా నిలిచిన ఆయన అభిమానులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నారు. రాజకీయ జీవితం, సినీ జీవితం ఎటు చూసిన ఆయనకు ఉన్న అభిమానుల సంఖ్య కోట్లలోనే ఉంటుంది. పవన్ హిట్ కొడితే రికార్డ్స్ అన్ని బద్దలు అవ్వాల్సిందే. 

Also Read: Tuck Jagadish Trailer: అంచనాలు పెంచిన టక్ జగదీష్ ట్రైలర్

ఇండస్ట్రీలోనూ అభిమానులే...
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో పవన్ అభిమానూలు చాలా మందే.. హీరోలు, డైరెక్టర్ లు,నిర్మాతలు, నటీ నటులు చాలా మంది పవన్ అభిమానులే.. హీరో నితిన్‌ (Hero Nithin), నిర్మాత బండ్ల గణేశ్‌ (Badla Ganesh), డైరెక్ట హరీశ్ శంకర్‌ (Director Harish Shankar).. వంటి వారు చాలా మందే ఉన్నారు. కొంత మంది పవన్ ను భగవంతుడి గా ఆరాధిస్తారు. అభిమానులు సమస్యల్లో ఉన్నారని తెలిస్తే చాలు వెంటనే వేల కిలో మీటర్ల దూరం వెళ్లి పరామర్శించిన రోజులున్నాయి. 

రీల్ హీరోనే కాదు రియల్ హీరో కూడా... 
స్టార్ హీరో.. ఒక్క సినిమాకి బోలెడంత డబ్బు.. అయిన  పవన్ కళ్యాణ్ అక్కడితో ఆగిపోలేదు... సమాజానికి తనవంతు భాద్యతగా ఏదైనా చేయాలని ఆశిస్తారు. ప్రజలకు ఏవైనా ఇబ్బందులు, విపత్తులు వచ్చిన ప్రతిసారి ముందుగా తనవంతు సాయంగా ఏదోకటి చేసి వెళతారు. సమాజంలో జరిగే అన్యాయాలపై ప్రత్యేకంగా తన అభిప్రాయాలను తెలపటమే కాదు తన వంతు కృషిని చేస్తారు. ఇలా సినిమా హీరోలనే కాదు.. సాధారణ ప్రజలను కూడా చైతన్యవంతం చేస్తుంటారు. పవన్ కళ్యాణ్ అంటే "సినిమా హీరోనే కాదు నిజ జీవితంలో కూడా ఒక హీరో" అనటంలో ఎలాంటి అతిశ్రేయోక్తి లేదు.  

Also Read: Dengue and Platelets: డెంగ్యూ ఉంది జాగ్రత్త, ప్లేట్‌లెట్ కౌంట్ ఎంత ఉండాలి, ఏం చేస్తే పెరుగుతుంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News