చిన్నపిల్లలా మారిపోయి నటి సందడి
కొందరికి వ్యక్తిగత జీవితం గుణపాఠాలు నేర్పుతుంది. వాటి నుంచి నేర్చుకుని ముందుకెళ్లేవారు విజయాలు సాధిస్తారు. ఆ నటి నిజ జీవితంలో రెండుసార్లు ఆమె మనసుకు గాయమైంది. ఆయన నవ్వుతూనే ముందుకు సాగుతున్నారు.
ముంబై: ఈ ఫొటోలు చూస్తే వీళ్లేవరో అక్కాచెల్లెల్లు అన్నట్లుగా కనిపిస్తున్నారు కదూ. కానీ వాళ్లు తల్లీకూతుళ్లు. బుల్లితెరపై సందడి చేసిన శ్వేతా తివారి అనతికాలంలోనే గుర్తింపు తెచ్చుకుని బాలీవుడ్ తలుపుతట్టింది. ఇటీవల జరిగిన తన సోదరుడు నిధాన్ వివాహ వేడుకలో నటి శ్వేతా తివారి తళుక్కున మెరిశారు. కూతురు పాలక్ తివారితో ఆమె దిగిన లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి. చిన్న వయసులోనే శ్వేతా తివారి వివాహం, ఆపై విడాకులు ఆమె జీవితాన్ని కాస్త మలుపుతిప్పాయి.
See Pics: టాలీవుడ్ ఎంట్రీకి ముందే మోడల్ రచ్చ రచ్చ!
తాజాగా సోదరుడు నిధాన్ పెళ్లి వేడుకలో సందడి చేస్తూ ఈ వయసులోనూ ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మరోసారి చిన్నపిల్లలా మారిపోయి మెహందీ ఫంక్షన్, ఇతర పెళ్లి వేడుకలో సందడి చేశారు. అందంలో కూతురు పాలక్ తివారికి పోటీ ఇస్తున్నారంటే అతిశయోక్తి కాదు. శ్వేతా తివారి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటోలు చూస్తే మీరు ఔరా అంటారు.
See Photos: అక్కాచెల్లెళ్లు కాదు.. తల్లీకూతుళ్లు!
హిందీ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4లో మహామహులను ఎదుర్కొని విజేతగా నిలిచారు శ్వేతా తివారి. జనవరి 8, 2011 తేదీని ఆమె తన జీవితంలో మరిచిపోరు. బిగ్ బాస్ విన్నర్‌గా అదే రోజు ప్రకటించారు.
Also Read: పుట్టింది ఫిబ్రవరి 29న.. మరి బర్త్ డేల సంగతేంటి?
Also Read: లీపు సంవత్సరంలో భారతీయులు దర్శించే ప్రాంతాలివే!