O Saathiya Motion Poster : సినీ పరిశ్రమలో మనకు లేడీ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు చాలా అరుదుగా ఉంటారు. అయితే ఇప్పుడు ఓ లేడీ డైరెక్టర్, ఓ లేడీ ప్రొడ్యూసర్ కలిసి ఓ సాథియా అనే సినిమాను రూపొందించారు. తన్విక జశ్విక క్రియేషన్స్ బ్యానర్ మీద చందన కట్టా ఓ సాథియా అనే చిత్రాన్ని నిర్మిస్తుండగా.. దివ్యా భావన దర్శకత్వం వహిస్తున్నారు. ఓ సాథియా సినిమాలో ఆర్యాన్ గౌర, మిస్తీ చక్రవర్తి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



అంతకు ముందు జీ జాంబీ అనే చిత్రంతో ఆర్యాన్ గౌర హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ఓ సాథియా అంటూ హీరోగా రెండో సినిమాతో రాబోతోన్నాడు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా.. రాజ్య సభ సభ్యుడు, లెజెండరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ముందుకు వచ్చాడు. ఆయన చేతుల మీదుగా ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు.


ఈ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌కు యూట్యూబ్‌లో మంచి ఆదరణ దక్కుతోంది. సంగీత దర్శకుడు విన్ను అందించిన మ్యూజిక్ ఈ మోషన్ పోస్టర్‌లో ఎంతో కూల్‌గా అనిపిస్తోంది. ప్యూర్ లవ్ స్టోరీగా రాబోతోన్న ఈ సినిమా మీద ప్రస్తుతం మంచి బజ్ క్రియేట్ అయింది. ఓ సాథియా నుంచి త్వరలోనే ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేయబోతోన్నట్టుగా మేకర్లు ప్రకటించారు. సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ తాజాగా ఈ సినిమా నుంచి రెండో పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా కోసం రఘు మాస్టర్, బాబా భాస్కర్, ఆనీ మాస్టర్ వంటి వారు కూడా పని చేస్తున్నారు. భాస్కర భట్ల, అనంత శ్రీరామ్ వంటి వారు పాటలు రాశారు.


Also Read:  Veera Simha Reddy Review : వీర సింహా రెడ్డి రివ్యూ.. మెప్పించిన బాలయ్య, నొప్పించిన గోపీచంద్


Also Read: Veera Simha Reddy Twitter Review : వీర సింహా రెడ్డి ట్విట్టర్ స్టోరీ.. బోయపాటి కన్నా అరాచకం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి