Yamadheera Producer Vedala Srinivas:కన్నడ హీరో కోమల్ కుమార్ హీరోగా..భారత క్రికెటర్ శ్రీశాంత్ యాంటీ హీరోగా నటించిన మూవీ 'యమధీర'. ఈ సినిమాలో నాగబాబు, ఆలీ, సత్య ప్రకాష్, మధు సూధన్ ఇతర లీడ్ రోల్స్ పోషించారు. ఇటీవలె విడుదలైన  ఈ సినిమాకి సంబంధించిన టీజర్ మరియు ట్రైలర్ సినిమా పైన అంచనాలను పెంచేసాయి. ఈ సందర్భంగా ఈ సినిమా నిర్మాత వేదాల శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యమధీర ఫిలిం ఈవీఎంల ట్యాంపరింగ్ పైన పిక్చరైజ్ చేసాము. అజర్ బైజాన్ కంట్రీ లో ఎక్కువ శాతం షూట్ చేసాము. 100 సినిమాల్లో నటించిన కోమల్ కుమార్, క్రికెటర్ శ్రీశాంత్ గారు ముఖ్య పాత్రలో నటించారు. అదేవిధంగా నాగబాబు, అలీ, సత్య ప్రకాష్, మధుసూదన్  నటించారు. టీజర్ అండ్ ట్రైలర్ పైన చాలా అద్భుతమైన స్పందన లభించింది. సినిమా పైన అంచనాలు పెరుగుతున్నాయి అదే విధంగా రోజురోజుకు థియేటర్లో పెరుగుతున్నాయి. చిన్న సినిమాలను సపోర్ట్ చేయడంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. ఈనెల 23న ప్రేక్షకుల ముందుకి సినిమాను తీసుకురాబోతున్నాముద. ఈ సినిమాని ప్రేక్షకుల ఆదరించి మంచి సక్సెస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకున్నారు.


శంకర్ దర్శకుడిగా చేస్తూ కన్నడ సినిమాగా తెరకెక్కించారు. తాజాగా ఈ చిత్రాన్ని తెలుగులో  యమధీర టైటిల్‌తో విడుదల చేస్తున్నారు. యమధీర టైటిల్ కూడా చాలా క్యాచీగా ఉంది. యమ గతంలో మన యమదొంగ, యమలీల, యమగోల వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి.  అదేవిధంగా ధీర మగధీర లాంటి బ్లాక్ బస్టర్ మూవీ ఉంది. కోమల్ కుమార్ కూడా పోలీస్ ఆఫీసర్ గా నటించారు. మొత్తం అంతా కూడా ఫారిన్ లొకేషన్స్ లో చాలా అద్భుతంగా ఈ సినిమాను పిక్చరైజ్ చేశారు. గతంలో విజయ్ సర్కార్ మూవీ లాగే ఇది కూడా పూర్తిగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీగా రాబోతుంది.  ఈవీఎం ల ట్యాంపరింగ్, పోలింగ్ తదితరల విషయాల  గురించి ఈ సినిమాలో ప్రస్తావించారు. ప్రస్తుత ట్రెండ్ కు తగ్గట్టుగా టెక్నికల్ వాల్యూస్ తో ఈ యమధీర సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 


Also Read: Arvind Kejriwal: మద్యం కుంభకోణంలో అనూహ్య మలుపు.. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్ట్‌


Also Read: Kavitha Arrest: కవిత అరెస్ట్‌ వెనకాల ఉన్న కథ ఇదే.. ఢిల్లీ కుంభకోణం అంటే ఏమిటి?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter