Yami Gautam slams Entertainment Portal over Writes her performance in Dasvi Movie: యామీ గౌతమ్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పేస్ క్రీమ్ 'ఫెయిర్ అండ్ లవ్లీ' యాడ్‌లో మెరిసిన యామీని రవిబాబు తెలుగు తెరకు పరిచయం చేశారు. 'నువ్విలా' సినిమా ద్వారా యామీ గౌతమ్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత నితిన్ హీరోగా వచ్చిన 'కొరియర్‌బాయ్ కళ్యాణ్', తరుణ్ 'యుద్ధం', అల్లు శిరీష్ 'గౌరవం' సినిమాలతో యామీ గౌతమ్ తెలుగు వారికి దగ్గరయ్యారు. ఇక బాలీవుడ్‌లో 'వికీ డోనార్' సినిమాతో యామీ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హీరో, సర్కార్, ఓ మై గాడ్, ఆక్షన్ జాక్షన్, సనమ్ రే, బాలా, కాబిల్, ఉరి సినిమాలతో స్టార్ హీరోయిన్ అయ్యారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పెళ్లి అనంతరం కూడా యామీ గౌతమ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా యామీ నటించిన చిత్రం దస్వీ.. ఏప్రిల్‌ 7న రిలీజ్ అయింది. జియో సినిమా, నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో చదువు ప్రాముఖ్యతను దర్శకుడు చూపించాడు. మిక్సడ్ టాక్ తెచుకున్న ఈ సినిమాపై ఓ బాలీవుడ్‌ పోర్టల్‌ రివ్యూ రాసింది. దస్వీ సినిమాలో యామీ నటన గురించి రాస్తూ.. ఇన్ని రోజుల చేసిన సాధారణ ప్రియురాలి పాత్రలకు ఈ సినిమాతో ఫుల్‌స్టాప్‌ పెట్టారని పేర్కొంది. అంతేకాకుండా గతంతో పోలిస్తే యామీ నటన ఫర్వాలేదని కూడా రాసింది. 


ఈ విషయంపై యామీ గౌతమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'విమర్శలకు నేను ఎప్పుడూ విలువ ఇస్తాను. అయితే దాంట్లోని వాస్తవాన్ని గ్రహించి తప్పులను సరిచేసుకుంటా. కొంతమంది కావాలనే తప్పుడు వ్యాఖ్యలు చేయడం, రాయడం చేస్తూ మమ్మల్ని కిందకు లాగుతున్నారు. వాటిపై తప్పకుండా స్పందించాలి. అందుకే ఇప్పుడు మాట్లాడుతున్నా.. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చాను. బాలా, ఉరి లాంటి విభిన్న సినిమాల్లో నటించా. ఆ సినిమాల్లో నాకు అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉంది' అని యామీ అన్నారు.


'ఇన్ని రోజులు నేను చేసిన పనిని విమర్శిస్తూ ఈ రకంగా కామెంట్‌ చేయడం అమర్యదపూర్వకం. ఇలా రాస్తున్నందుకు చాలా బాధగా కూడా ఉంది. ఇప్పటివరకూ మీ పోర్టల్‌ని నేను ఫాలో అయ్యేదాన్ని. ఇకపై మాత్రం మిమ్మల్ని ఫాలో కాను. దయచేసి నా గురించి మీరు రివ్యూలు రాయకండి' అని యామీ గౌతమ్ కోరారు. ప్రస్తుతం యామీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందరూ యామీకి మద్దతుగా నిలుస్తున్నారు. 


Also Read: Yuzvendra Chahal: ఆ క్రికెటర్ ఫుల్‌గా తాగి.. 15వ అంతస్థు నుంచి నన్ను తోసేయ‌బోయాడు: చహల్


Also Read: Precaution Dose: కోవిడ్ వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక ప్రకటన... 18 ఏళ్లు పైబడినవారికి ప్రికాషన్ డోసులు...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook