Yuzvendra Chahal: ఆ క్రికెటర్ ఫుల్‌గా తాగి.. 15వ అంతస్థు నుంచి నన్ను తోసేయ‌బోయాడు: చహల్

Yuzvendra Chahal reveals shocking 2013 IPL experience. ఐపీఎల్ 2013 సీజన్‌లో ఓ క్రికెటర్‌ తాగిన మైకంలో తనను 15వ అంతస్తులోని బాల్కనీ నుంచి తోసేయ‌బోయినట్లు టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్‌ వెల్లడించాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 8, 2022, 02:50 PM IST
  • ఆ క్రికెటర్ ఫుల్‌గా తాగి 15వ అంతస్థు నుంచి తోసేయ‌బోయాడు
  • 15వ అంతస్తులో వేలాడదీశాడు
  • ఎవరికీ తెలియని సంఘటన
Yuzvendra Chahal: ఆ క్రికెటర్ ఫుల్‌గా తాగి.. 15వ అంతస్థు నుంచి నన్ను తోసేయ‌బోయాడు: చహల్

Yuzvendra Chahal reveals shocking 2013 IPL experience: టీమిండియా మణికట్టు స్పిన్నర్‌ యుజ్వేంద్ర చహల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్పిన్ మాయాజాలంతో పాటు చిలిపితనం కూడా మనోడికి కాస్త ఎక్కువే. మ్యాచ్ జరుగుతుండగానే సహచరులను తన అల్లరి పనులతో ఆటపట్టిస్తుంటాడు. యూజీకి ప్రత్యేకంగా ఓ యూట్యూబ్ ఛానెల్‌ కూడా ఉంది. అందులో భారత ఆటగాళ్లను ఇంటర్వ్యూలు చేస్తూ అభిమానులకు కావాల్సిన వినోదాన్ని అందిస్తాడు. అందుకే మనోడికి అల్లరి పిల్లడు అనే బిరుదు కూడా ఉంది. అయితే ఎప్పుడూ ఫన్నీ విషయాలు చెప్పే చహల్.. ఈ సారి మాత్రం ఎవరికీ తెలియని సంఘటనను తెలిపాడు. 

ఐపీఎల్ 2013 సీజన్‌లో ఓ క్రికెటర్‌ తాగిన మైకంలో తనను 15వ అంతస్తులోని బాల్కనీ నుంచి తోసేయ‌బోయినట్లు టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌, కరుణ్ నాయర్‌లతో జరిగిన ఇంటర్వ్యూలో యుజ్వేంద్ర చహల్‌ వెల్లడించాడు. అయితే ఆ క్రికెటర్‌ పేరు మాత్రం యూజీ బయట పెట్టలేదు. ఈ ఇంటర్వ్యూ వీడియోను రాజస్థాన్‌ రాయల్స్ ప్రాంచైజీ ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకుంది. చహ‌ల్ 2013 సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్ త‌ర‌పున ఆడిన విషయం తెలిసిందే.

'ఈ విషయాన్ని నేను ఇప్పటి వరకూ ఎవ్వరికీ చెప్పలేదు. 2013లో నేను ముంబై ఇండియన్స్ తరఫున ఆడాను. బెంగళూరులో మేం ఒక మ్యాచ్‌ గెలిచాక పార్టీ చేసుకున్నాం. ఆ సమయంలో ఒక క్రికెటర్‌ ఫుల్‌గా తాగాడు. ఆ మైకంలో నన్ను చాలాసేపు గమనించి.. తన వద్దకు రమ్మన్నాడు. అతడి వద్దకు వెళ్లగానే నన్ను ఎత్తుకొని 15వ అంతస్తులోని బాల్కనీలో వేలాడదీశాడు. ఆ సమయంలో నేను నా చేతులతో అతడి మెడను గట్టిగా పట్టుకున్నా. నా పట్టు ఏ మాత్రం సడలినా.. నా పని అయిపోయేది. ఇది చుసిన అక్కడున్న వారు నా దగ్గరకు వచ్చి  కిందకు దించారు' అని యుజ్వేంద్ర చహల్‌ తెలిపాడు. 

'ఆ సంఘటనలో నేను తృటిలో చావు నుంచి తప్పించుకున్నా. అప్పుడు ఏమాత్రం చిన్న తప్పిదం జరిగినా.. ఈరోజు ప్రాణాలతో ఉండేవాడికి కాదు. ఆ సంఘటనతో ఎక్కడికైనా వెళ్తే ఎలా ఉండాలో తెలిసొచ్చింది' అని మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్‌ చెప్పుకొచ్చాడు. రాజస్థాన్‌ రాయల్స్ పోస్ట్ చేసిన వీడియోపై నెటిజన్లు, ఫాన్స్ స్పదింస్తున్నారు. ఆ క్రికెటర్‌ పేరు చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 2013లో ముంబై తరఫున ఆడిన చహల్‌.. ఆపై బెంగళూరకు వెళ్లిపోయి స్టార్ అయ్యాడు. ఐపీఎల్ 2022 వేలంలో బెంగళూరు అతడిని వదిలేయడంతో రాజస్థాన్‌ కైవసం చేసుకుంది.

Also Read: Akhil Akkineni: మాస్‌ లుక్‌లో అక్కినేని అఖిల్.. బ‌ర్త్‌డే పోస్ట‌ర్‌ అదిరిందిగా!

Also Read: Anrich Nortje: అన్రిచ్ నోర్జ్‌ను బౌలింగ్‌ వేయకుండా అడ్డుకున్న అంపైర్లు.. కారణం ఏంటో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News