KGF 2 Collections: కేజీఎఫ్ 2 వసూళ్ల సునామీ... ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లు కొల్లగొట్టిన రాకీభాయ్...
KGF 2 World Wide Collections: బాక్సాఫీస్ వద్ద కేజీఎఫ్ 2 ప్రభంజనం కొనసాగుతోంది. ఈ సినిమా ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లు కొల్లగొట్టింది.
KGF 2 World Wide Collections: ఒక సాదా సీదా సినిమాగా ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన కేజీఎఫ్ 1 కన్నడ సినిమా రేంజ్‌ను ఎక్కడికో తీసుకెళ్లింది. కేజీఎఫ్ 1 బ్లాక్ బ్లస్టర్ హిట్ అవడంతో కేజీఎఫ్ చాప్టర్ 2 కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూశారు. అందుకు తగినట్లే కేజీఎఫ్ 2 ప్రేక్షకుల అంచనాలను అందుకుంది. ఇంకా చెప్పాలంటే... అంచనాలను మించేసింది. సినిమా విడుదలై నెల రోజులు గడుస్తున్నా బాక్సాఫీస్ వద్ద కేజీఎఫ్ 2 దండయాత్ర సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది.
ప్రపంచవ్యాప్తంగా కేజీఎఫ్ 2 ఇప్పటివరకూ రూ.1200 కోట్లు కొల్లగొట్టింది. ఈ క్లబ్‌లో చేరిన మూడో ఇండియన్ సినిమాగా నిలిచింది. అమీర్ ఖాన్ దంగల్, ప్రభాస్ బాహుబలి చిత్రాల తర్వాత ఆ స్థాయి వసూళ్లు రాబట్టింది కేజీఎఫ్ 2 మాత్రమే. మొదటివారంలో ఈ సినిమా రూ.720.31 కోట్లు, రెండో వారంలో రూ.223.51 కోట్లు, మూడో వారంలో రూ.140.55 కోట్లు, నాలుగో వారంలో రూ.91.26 కోట్లు, ప్రస్తుత ఐదోవారంలో ఇప్పటివరకూ రూ.24.93 కోట్లు రాబట్టింది. మొత్తంగా ఇప్పటివరకూ రూ.1200.76 కోట్ల వసూళ్లు కలెక్ట్ చేసింది. ట్రేడ్ అనలిస్ట్ మనోబాల విజయబాలన్ తన ట్వీట్ ద్వారా ఈ వివరాలు వెల్లడించారు.
ఒక్క హిందీలోనే కేజీఎఫ్ 2 రూ.430 కోట్లు వరకు వసూలు చేయడం విశేషం. బాలీవుడ్‌లో కొత్త సినిమాలు విడుదలవుతూనే ఉన్నా.. అవేవీ కేజీఎఫ్ 2 వసూళ్లపై ప్రభావం చూపించలేదు. ఇదే దూకుడు కొనసాగితే కేజీఎఫ్ 2 మున్ముందు మరిన్ని రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమనే చెప్పాలి.
కేజీఎఫ్ 2 గత నెల 14న ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. యశ్-శ్రీనిధి శెట్టి జంటగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. విడుదలైన అన్నిచోట్ల ప్రేక్షకుల నుంచి సినిమాకు అద్భుతమైన స్పందన లభించింది. ఒకరకంగా ఈ సినిమా ఇండియన్ సినిమాను మరో మెట్టు ఎక్కించిందని చాలామంది ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. రాకీభాయ్‌గా యశ్ పెర్ఫామెన్స్, ప్రశాంత్ నీల్ డైరెక్షన్, రవి బర్సూర్ సంగీతం సినిమాకు హైలైట్‌గా నిలిచాయి.
Also Read: Janhvi Kapoor Pics: పొట్టి డ్రెస్సులో జాన్వీ కపూర్.. అమ్మడిని ఇలా ఎప్పుడూ చూసుండరు!
Also Read: Chandra Babu Naidu: సీఎం జగన్ ఇలాకాలో చంద్రబాబు పాచికలు పారుతాయా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook