Yatra 2 Success Meet: ఫిబ్రవరి 8న థియేటర్స్ లో విడుదలైన సినిమా యాత్ర 2. ఆంధ్ర‌ప్ర‌దేశ్ దివంగ‌త ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పేద‌ల క‌ష్ట‌న‌ష్టాల‌ను తెలుసుకుని వాటిని తీర్చ‌టానికి చేసిన పాద‌యాత్ర ఆధారంగా రూపొందిన సినిమా ‘యాత్ర’. ఇప్పుడు ఆ చిత్రాన్ని కొనసాగింపుగా  చిత్రం ‘యాత్ర 2’ తెరకెక్కించారు దర్శకుడు. వై.ఎస్‌.ఆర్ పాత్ర‌లో మ‌ల‌యాళ స్టార్ మ‌మ్ముట్టి న‌టించ‌గా.. ఆయ‌న‌ త‌న‌యుడు వై.ఎస్‌.జ‌గ‌న్ పాత్ర‌లో కోలీవుడ్ స్టార్ జీవా న‌టించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తరువాత , వై.ఎస్‌.జ‌గ‌న్ ఎదుర్కొన్న సమస్యలు, ఆయన పేద‌ల కోసం చేసిన పాద‌యాత్ర ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాకి విడుదలైన రోజు దగ్గరనుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో, ఈ చిత్రయూనిట్ శుక్రవారం సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. 


ఈ నేపథ్యంలో దర్శకుడు మహి వీ రాఘవ్ మీడియాతో మాట్లాడుతూ..‘నేను తీసిన యాత్ర 2 కొందరికి నచ్చింది.. కొంతమందికి మాత్రం నచ్చలేదు.. తీసిందే పొలిటికట్ మూవీ, రాజకీయ నాయకుడి మీద కాబట్టి.. భిన్నాభిప్రాయాలు రావడం సహజం. కానీ ఓ స్టోరీ టెల్లర్‌గా, నేను అనుకున్న కథ, స్క్రిప్ట్‌ను తీశాను. అందరూ తమ తమ అభిప్రాయాలు పంచుకున్నారు. చాలామంది సినిమా బాగుందనే తెలిపారు. మా టెక్నికల్ టీంకు థాంక్స్. మమ్ముట్టి గారు, జీవా గారికి థాంక్స్. ఒక సినిమా రిలీజ్ అయ్యాక దాన్నుంచి బయటకు వచ్చేస్తా. యాత్ర 2 తీయాలని 2019లోనే నిర్ణయించుకున్నా. రాజశేఖర్ రెడ్డి, జగన్ ఇద్దరు కథ చెప్పాలని అనుకున్నా. ఆ కథకు తగ్గట్టుగానే పాత్రలను పెట్టాను. వేరే పాత్రలు లేవు అని అంతా అడుగుతుంటారు. కానీ నా కథకు తగ్గట్టుగానే నేను పాత్రలు పెట్టుకున్నాను. సీఎం వైఎస్ జగన్ గారు ఇంకా సినిమాను చూడలేదు. ఆయన త్వరలోనే చూస్తారు. నంద్యాల బై ఎలక్షన్ సీన్ తీశాను. కానీ ఎడిటింగ్‌లో తీసేశాను. సినిమా విడుదల ఒక్కరోజే కావడంతో ఇంకా కరెక్ట్ రెస్పాన్స్ అనేది తెలియడం లేదు. సోమవారం నుంచి రియల్ టాక్ తెలుస్తుంది. థియేటర్లో మ్యూజిక్, విజువల్స్, డైలాగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే సేవ్ ది టైగర్స్ 2 రాబోతోంది. నేను ఓ కథను రాయడానికే టైం పడుతుంది. మెల్లిగానే సినిమాలు చేస్తాను,’ అని తెలియజేశారు ఈ హీరో.


Also Read: Oppo A59: ఫ్లిప్‌కార్ట్‌లో ఒక్కసారిగా తగ్గిన Oppo A59 మొబైల్‌ ధర..ఎగబడి కొంటున్న జనాలు!


Also Read: YSRCP MP Candidates: వైఎస్సార్‌సీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే.. మూడో స్థానానికి కూడా పోటీతో ఎన్నికలు రసవత్తరం


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter