Yatra 2 World Wide Closing Collections: 2024 సాధారణ ఎన్నికలకు కొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. మరో రెండు వారాల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ రానుంది. ఎలక్షన్స్‌లో గెలుపే లక్ష్యంగా వై.యస్.జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఎవరి ఎత్తులు వారు వేస్తున్నారు. అందుకోసం సినిమాలను ఆయుధులుగా వాడుకుంటున్నారు. ఈ కోవలో 'యాత్ర 2' అంటూ వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయుడిగా ముఖ్యమంత్రి కావడానికి వై.యస్.జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర నేపథ్యంలో 'యాత్ర 2' మూవీ తెరకెక్కింది. యాత్ర2లో మమ్ముట్టి .. వైయస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో నటిస్తే.. తమిళ నటుడు జీవా వై.యస్.జగన్మోహన్ రెడ్డి పాత్రలో యాక్ట్ చేసారు.
ఈ నెల 8న విడుదలైన ఈ సినిమాకు మంచి అప్లాజ్ వచ్చింది. రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత హై కమాండ్ నుంచి పాదయాత్ర చేయకూడదంటూ ఆదేశాలు. వాటిని ధిక్కరించి పాదయాత్ర చేసి పొలిటికల్ లీడర్‌గా వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎలా ఎదిగాడు. ముందుగా ప్రతిపక్ష నేత.. ఆ తర్వాత ముఖ్యమంత్రి కావడానికి తండ్రిలా పాద యాత్ర ఎలా ఉపయోగపడిందనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో ఆర్టిస్టుల రెమ్యునరేషన్‌తో పాటు మొత్తంగా రూ. 50 కోట్లు ఖర్చు అయినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కానీ ఈ సినిమా వైసీపీకి అనుకూలంగా తెరకెక్కడం.. ఓ వర్గం ప్రేక్షకులకు నచ్చేలా మూవీ ఉండటం ప్రతికూలంగా మారింది. అది వసూళ్లపై ప్రభావం చూపించింది.
కేవలం వన్ సైడెడ్‌గా తెరకెక్కిన ఈ సినిమా అవతలి పక్షం వాళ్లను విలన్స్‌గా చూపెట్టం వంటి ఈ సినిమాకు మైనస్‌గా మారాయి. అప్పట్లో ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలకు ప్రేక్షకులు ఎలా తిరస్కరించారో.. తాజాగా 'యాత్ర 2' మూవీని ఆడియన్స్‌ అసలు పట్టించుకోలేదనే చెప్పాలి.
పూర్తిగా జగన్మోహన్ రెడ్డి కోణంలో తెరకెక్కిన ఈ సినిమా కొన్ని నిజాలున్నా.. మిగతాది సినిమాక్ కల్పితాలన్నది ప్రతిపక్షలా ఆరోపణలు చేసాయి. ఈ సినిమా ఫస్ట్ డే చేసినంత హడావుడి ఆ తర్వాత లేదు. కమర్షియల్ అంశాలకు దూరంగా సీరియస్‌గా సినిమా కథ సాగడం 'యాత్ర 2'కు ప్రతికూలంగా మారాయి. ఇప్పటికే విడుదలైన అన్ని ఏరియాల్లో ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది. రూ. 50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాపత్ంగా రూ. 3.70 కోట్ల షేర్ (రూ. 8 కోట్ల గ్రాస్) వసూళ్లను మాత్రమే రాబట్టింది. ఓవరాల్‌గా బడ్జెట్ పరంగా ఈ సినిమా 10 శాతం రికవరీ కూడా రాబట్టలేకపోయింది. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా రూ. 10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 11 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో ఈ సినిమా రూ. 7.30 కోట్ల రేంజ్‌లో నష్టాలను తీసుకొచ్చి.. బాక్సాఫీస్ దగ్గర డబుల్ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా ఏదైనా డబ్బులు వస్తే గిస్తే.. డిజిటల్, శాటిలైట్ రూపేణా రావాల్సిందే. ఏది ఏమైనా ఎంతో అట్టహాసంగా ఎన్నికల అస్త్రంగా మలిచిన ఈ సినిమా థియేట్రికల్‌గా ఫెయిల్ అయినా.. ఓటీటీ వేదికగా ఎలాంటి సంచలనం రేపుతుందనేది చూడాలి.