Yatra 2 Movie: యాత్ర 2 సినిమాపై ఎవరేమనుకున్నా ఫరవాలేదు, ఎన్నికల ముందే విడుదల
Yatra 2 Movie: వైఎస్సార్ బయోపిక్ గా తెరకెక్కిన యాత్రకు సీక్వెల్ యాత్ర 2 తెరకెక్కుతోంది. వైఎస్ జగన్ జీవిత సంఘటనల ఆధారంగా సినిమా తీస్తున్న దర్శకుడు మహి వి రాఘవ్ సంచలన విషయాలు వెల్లడించాడు.
Yatra 2 Movie: ఏపీలో ఎన్నికలు మరో ఏడాది ఉండగానే వాతావరణ వేడెక్కిపోయింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై మరొకరు విమర్శలు ఎక్కుపెట్టుకుంటున్నారు. మరోవైపు ఎన్నికల ముందు ఏపీ రాజకీయాలపై కొన్ని సినిమాలు విడుదల కానున్నాయి. పూర్తి వివరాలు మీ కోసం..
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు విడుదల కానున్న రెండు ప్రధానమైన సినిమాలు వ్యూహం, యాత్ర-2. దర్శకుడు మహి వి రాఘవ్ తెరకెక్కించిన యాత్ర సినిమాకు సీక్వెల్ యాత్ర-2. గత ఎన్నికలకు కొద్దిగా ముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా తీసిన యాత్ర ప్రజలపై కొంత ప్రభావం చూపించిందని కొందరు, చూపించలేదని మరి కొందరు వాదిస్తున్నారు. ఏదేమైనా యాత్ర 2 మాత్రం 2024 ఎన్నికలకు కొద్దిగా ముందు విడుదల కానుంది. వైఎస్ జగన్ జీవితంలో 2009 నుంచి 2019 వరకూ జరిగిన ప్రయాణమే యాత్ర 2 అని దర్శకుడు మహి వి రాఘవ్ స్పష్టం చేశారు. అంటే తండ్రి మరణం నుంచి తను ముఖ్యమంత్రి అయ్యేవరకూ జరిగిన పరిణామాలకు దృశ్య సమాహారమే యాత్ర 2.
అయితే సినిమాలు ఓటర్లపై ప్రభావం చూపించవని..ముఖ్యంగా ఏపీ ఓటర్లను తక్కువగా అంచనా వేయవద్దని యాత్ర 2 దర్శకుడు మహి వి రాఘవ్ తెలిపారు. యాత్ర 2 సినిమాతో ఓటర్లు ప్రభావితం అవుతారనేది అవాస్తవమన్నారు. సినిమా చూసి ప్రజలు ఉద్వేగానికి లోనైనా ఆ తరువాత పోలింగ్ బూత్‌లో ప్రవేశించాక నచ్చిన వాళ్లకే ఓటేస్తారని చెప్పారు. యాత్ర 2లో వైఎస్ జగన్ ప్రయాణం ఎక్కడి నుంచి మొదలైంది, ఎక్కడి వరకూ ఎదిగారనేది చూపిస్తున్నామన్నారు. యాత్ర 2 సినిమాను వైసీపీ వాళ్లకే తీస్తున్నామనుకుంటే అనుకోనివ్వమన్నారు. ఆర్జీవీ తెరకెక్కిస్తున్న వ్యూహం సినిమా తమ సినిమాపై ప్రభావం చూపించదన్నారు. యాత్ర 2 సినిమా మాత్రం వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందు విడుదల చేస్తున్నామన్నారు.
యాత్ర 2 సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాకపోయినా ఇవాళ వైఎస్ఆర్ జయంతి పురస్కరించుకుని మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమాలో వైఎస్ జగన్ పాత్రను తమిళ నటుడు జీవా కన్పించనున్నారు.
Also read: Sreeleela Pics: బెడ్‌పై శ్రీలీలా కిల్లింగ్ లుక్స్.. ధమాకా బ్యూటీ లేటెస్ట్ పిక్స్ చూస్తే నిద్రపట్టదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook