Sushanth Singh Rajput Friend - Actress Vaishali Thakkar Dies by Suicide In Indore: సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ ఆర్థిక రాజధాని ఇండోర్‌లో హిందీ బుల్లితెర టీవీ నటి వైశాలి ఠక్కర్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఆమె వయస్సు 29 సంవత్సరాలు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇక ఆ ఘటనా స్థలం నుంచి సూసైడ్ నోట్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రాస్తుతానికి ఎఫ్‌ఎస్‌ఎల్‌ బృందం(ఫోరెన్సిక్ టీమ్) దానిని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించింది. ఆమె ప్రియుడు మోసం చేసినందువల్ల ఆమె ఆత్మహత్య చేసుకుందని ప్రాధమికంగా అంచనా వేస్తున్నారు. అయితే విచారణ పూర్తయిన తర్వాతే పోలీసులు ఈ విషయం మీద ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఉరి వేసుకుని ఆమె కొన్ని రోజుల క్రితమే ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే 6 రోజుల క్రితమే వైశాలి తన సోషల్ మీడియా ఖాతాలో సీలింగ్ ఫ్యాన్‌ను చూపుతున్న రీల్‌ను షేర్ చేసింది. ఇక పోలీసులు ఇండోర్‌లోని తేజాజీ నగర్ పోలీస్ స్టేషన్ సాయిబాగ్ కాలనీలో ఉన్న తన ఇంట్లో వైశాలి ఠక్కర్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.


ముంబయిలో 7 సంవత్సరాలు నివసించిన వైశాలి గత ఏడాదిగా ఇండోర్‌ కు షిఫ్ట్ అయింది. నిజానికి వైశాలి ఠక్కర్ ఇండోర్‌లోనే తన చదువు పూర్తి చేసింది. ఆమె కుటుంబం వాస్తవానికి ఉజ్జయినిలోని మహిద్‌పూర్‌కు చెందినదయినా చదువు కోసం వైశాలి ఇండోర్ చేరింది. ఇండోర్‌లోని EMRC (ఎడ్యుకేషనల్ మల్టీమీడియా రీసెర్చ్ సెంటర్)లో చదివిన తర్వాత ఆమె యాంకరింగ్ రంగంలో ప్రయత్నాలు చేసి చివరికి ముంబైకి వెళ్లి నటిగా అమరింది.


మన్మోహిని, సూపర్ సిస్టర్స్, విష్ సహా అమృత్ వంటి అనేక సూపర్‌హిట్ సీరియల్స్‌లో నటించిన వైశాలి ఠక్కర్, గత ఏడాది ఏప్రిల్‌లో మిస్టర్ ఆఫ్రికా టైటిల్ గెలుచుకున్న డాక్టర్ అభినందన్ సింగ్‌తో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. కానీ ఇద్దరి సంబంధం ఎక్కువ కాలం కొనసాగలేదు, ఈ నిశ్చితార్థం ఒక నెల తర్వాత క్యాన్సిల్ అయింది. ఇండోర్ పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, వైశాలి ఇప్పుడు వేరొకరితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నట్లు ఆమె సూసైడ్ నోట్లో ఉన్నట్టు తెలుస్తోంది.  అయితే ప్రియుడి చేతిలో మోసపోవడంతో మనస్తాపం చెందిన వైశాలి మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని అంటున్నారు.


అయితే ఎఫ్‌ఎస్‌ఎల్ బృందం సూసైడ్ నోట్‌ను డీకోడ్ చేసే వరకు పోలీసులు దానిని ధృవీకరించే అవకాశం లేదు. ప్రసిద్ధ షో ‘యే రిష్తా క్యా కెహ్లతా హై’లో సంజన పాత్రలో వైశాలి ఠక్కర్ కనిపించి మంచి గుర్తింపు కూడా తెచ్చుకుంది. ఆ తర్వాత 'ససురల్ సిమర్ కా' షోలో అంజలి పాత్ర పోషించింది. వైశాలి చివరిసారిగా 2019లో మన్మోహినిలో కనిపించింది. ఇక వైశాలి టీవీతో పాటు సినిమాల్లో కూడా కొన్ని పాత్రలు పోషించారు. 


వైశాలి ఠక్కర్‌ కొన్నాళ్ల క్రితం సూసైడ్ చేసుకున్న దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు బెస్ట్ ఫ్రెండ్ అని తెలుస్తోంది. సుశాంత్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని చెబుతూ ఆయన చనిపోయిన సమయంలో వైశాలి అనేక అనుమానాలు వ్యక్తం చేసింది. రియా చక్రవర్తి పాటు మరికొందరు ఉండి ఉంటారని అనుమానం వ్యక్తం చేసి.. అప్పట్లో వైశాలి హాట్ టాపిక్ గా మారింది. 
Also Read: Pawan Kalyan- Balakrishna: ఫ్యాన్స్ కు మెంటలెక్కించేలా పవన్ – బాలయ్య ఫేస్ టు ఫేస్..త్రివిక్రమ్ ఫోన్ కాల్ తో మేటర్ లీక్!


Also Read: Balakrishna Flirting: హీరోయిన్ తో బాలయ్య పులిహోర.. నువ్ చందమామ నేను చీకటి.. కలిస్తే పున్నమిరాత్రే అంటూ!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook