సక్సెస్ ఫుల్ యంగ్ డైరెక్టర్ రావిపూడి  మల్టీస్టారర్ తో సినిమా తీసేందుకు ప్లాన్ చేసినట్లు టాక్. ఈ సినిమాలో ఓ సీనియర్ హీరోతో యంగ్ హీరో నటిస్తాడని తెలిసింది. అయితే ఏ ప్రాతలో  ఎవరు నటిస్తారనే విషయంపై ఇంక్లా క్లారిటీ రాలేదు. ఇప్పటికే పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్ సినిమాలతో  అనిల్ రావిపూడి దర్శకుడిగా హ్యాట్రిక్ అందుకున్న విషయం తెలిసిందే. మంచి ఉపు మీదున్న ఈ డెరెక్టర్... ఏ హీరోలతో మల్టీ స్టారర్ చేస్తాడో చూడాలి.


ప్రెజెంట్ కింగ్ నాగార్జున -నేచురల్ స్టార్ నాని కాంబినేషన్ లో శ్రీరామ్ ఆదిత్య అనే యంగ్ డైరెక్టర్ మల్టీస్టారర్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.. సీనియర్ హీరో- యంగ్ హీరో కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఈ సినిమా ఇప్పటికే హాట్ టాపిక్ గా మారింది.. ఇప్పుడు అనిల్ రావి పూడి కూడా ఇదే స్టైల్ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తూ ప్రెజెంట్ ఆ సినిమా స్క్రిప్ట్ వర్క్ లో బిజీ అయ్యాడని, ఈ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నాడని సమాచారం.