I Hate You Movie Trailer: యంగ్ హీరో కార్తీక్ రాజు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. గతేడాది ‘అథర్వ’ అంటూ ప్రేక్షకులను పలకరించగా.. త్వరలోనే ‘ఐ హేట్ యు’ అంటూ ఆడియెన్స్ ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో కార్తీక్ రాజు సరసన మోక్ష, షెర్రీ అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. బి.లోకనాథం సమర్పణలో శ్రీ గాయత్రి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగరాజ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అంజి రామ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 2న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ ట్రైలర్‌ను రిలీజ్ చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. స్నేహం, ప్రేమ బంధాల చుట్టూ సాగే కథలా కనిపిస్తోంది. ఇక అంతకు మించిన థ్రిల్లింగ్ పాయింట్, క్రైమ్ సస్సెన్స్ డ్రామాను కూడా ఇందులో చూపించబోతోన్నారని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ట్రైలర్ చూస్తుంటే రొమాంటిక్ సన్నివేశాలు యూత్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా ఉన్నాయి. హీరో యాక్షన్, రొమాంటిక్ సీన్స్ ట్రైలర్‌లో హైలెట్ అవుతున్నాయి.


‘నిన్ను ఎప్పుడూ వదిలి వెళ్లను’ అంటూ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ఆరంభం అవుతుంది. ప్రాణ స్నేహితులైన ఇద్దరు అమ్మాయిల జీవితాల్లో జరిగిన ఘటనలే ఐ హేట్ యు కథ అని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. ‘దేవుడు కాదు.. ఈ మనుషులే మనకు అన్యాయం చేస్తున్నారు’.. అనే ఎమోషనల్ డైలాగ్ సైతం ఆకట్టుకునేలా ఉంది. ట్రైలర్‌లోని విజువల్స్, ఆర్ఆర్ అన్నీ కూడా ఆడియెన్స్‌ను మెప్పించేలా ఉన్నాయి.


ప్రేమలో కొత్త కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని ఇది వరకు మేకర్లు చెప్పిన మాటలు నిజమని ఈ ట్రైలర్‌ చూస్తే తెలుస్తుంది. కొత్త ప్రేమ కథను ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తున్నారనిపిస్తోంది. ఫిబ్రవరి 2న ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది.


నటీనటులు : కార్తీక్ రాజు, మోక్ష, షెర్రీ అగర్వాల్ తదితరులు


సాంకేతిక వర్గం:


చిత్ర సమర్పణ - బి.లోకనాథం, బ్యానర్- శ్రీ గాయత్రి ఎంటర్‌టైన్‌మెంట్స్, నిర్మాత - నాగరాజు, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - అంజి రామ్, అసోసియేట్ ప్రొడ్యూసర్ - అనూష, కో ప్రొడ్యూసర్ - విష్ణు తేజ స‌ర్విశెట్టి, నిర్మల్ కుమార్ రాజు, సినిమాటోగ్రఫీ - ఎస్.మురళీ మోహన్ రెడ్డి, మ్యూజిక్ - సాకార్, ఒరిజినల్ స్టోరి, డైలాగ్స్ - ప్రభోద్, ఎడిటర్ - జె.ప్రతాప్ కుమార్, స్టంట్స్ - రామకృష్ణ, కొరియోగ్రాఫర్ - అనీష్, పి.ఆర్.ఒ - మోహన్ తుమ్మల.


Also Read: Cable Operator Murder Attempt: బామ్మపై కేబుల్‌ ఆపరేటర్‌ హత్యాయత్నం.. శ్వాస ఇచ్చి తల్లికి పునర్జన్మనిచ్చిన కుమార్తె


Also Read: PM Kisan Budget 2024: రైతులకు ప్రధాని మోదీ భారీ కానుక.. బడ్జెట్‌లో తీపి కబురు


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి