Vijayasai Reddy Review SVP Movie: సర్కారు వారి పాట సినిమాపై ఇప్పుడు సినీ విశ్లేషకులే కాదు రాజకీయ నేతలు కూడా రివ్యూలు ఇస్తున్నారు. మహేశ్ సినిమాపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రివ్యూ హాట్ టాపిక్‌గా మారింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సూపర్‌స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేశ్ నటించిన సర్కారు వారి పాట సినిమాపై పాజిటివ్ టాక్ వస్తోంది. ఇవాళ విడుదలైన ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంటోంది. గీత గోవిందం బ్లాక్ బస్టర్ మూవీ తెరకెక్కించిన పరశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాపై ఇప్పటివరకూ పాజిటివ్ టాక్ విన్పిస్తోంది. 


సాధారణంగా సినిమాలపై సినీ విశ్లేషకులు రివ్యూ ఇస్తుంటారు. కానీ ఈసారి రాజకీయ నేతలు కూడా రివ్యూ ఇస్తున్నారు. సినిమా ఎలా ఉందో..ట్వీట్ చేస్తున్నారు. వైసీపీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి..సర్కారు వారి పాట సినిమాపై ఇచ్చిన రివ్యూ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో బ్యాంకు కుంభకోణాలు, బ్యాంకులకు కార్పొరేట్ అధినేతలు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టడం వంటి అంశాలు చూపించారు. ఇదే విషయంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు.


ముందుగా సర్కారు వారి పాట చిత్ర యూనిట్, మహేశ్ బాబును విజయసాయి రెడ్డి అభినందించారు. పేదలు, పెద్దలకు రుణాలివ్వడంలో బ్యాంకులు చూపించే తేడాను తెరపై చక్కగా చూపించారని, సమకాలీన అంశాల్ని స్పృశిస్తూ సాగిన సందేశాత్మక సినిమా అని విజయసాయి రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు. 


ఇటీవలే మహేశ్ బాబు..ఇతర నటులు చిరంజీవి, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివలతో కలిసి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిశారు. ఈ కలయిక గురించి ఇటీవల మాట్లాడిన మహేశ బాబు..ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌‌పై ప్రశంసలు కురిపించారు. 2-3 సార్లు ఫోన్‌లో మాట్లాడటమే తప్ప..నేరుగా ఎప్పుడూ కలవలేదని..అంత సింపుల్‌గా ఎలా ఉంటారని ప్రశంసించారు. ఇప్పుడు మహేశ్ సినిమాపై విజయసాయి రెడ్డి ప్రశంసలు కురిపించారు. 


Also read: Mahesh Babu Controversy: మహేశ్ బాబు వ్యాఖ్యలపై బోనీ కపూర్, ఆర్జీవీలు ఏమన్నారు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook