YVS Chowdhary: వైవిఎస్ చౌదరి భార్య గురించి తెలుసా.. అప్పట్లో నాగార్జునతో సైతం నటించిన నటి
YVS Chowdhary Wife: హరికృష్ణ, మహేష్ బాబు, నాగార్జున ఇలా ఎంతోమంది హీరోలతో సినిమాలు తీసి.. మంచి విజయాలు అందుకున్న దర్శకుడు వైవిఎస్ చౌదరి. ప్రస్తుతం కొద్దిరోజులుగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ దర్శకుడు.. ఇప్పుడు మళ్లీ నందమూరి ఫ్యామిలీలో వారసడుతో సినిమాల్లోకి రానున్నారు.. ఈ క్రమంలో ఈ దర్శకుడి భార్య గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
YVS Chowdhary Wife Details: శ్రీ సీతారాముల కళ్యాణం చూతుము రారండి, సీతయ్య, సీతారామరాజు, లాహిరి లాహిరి లాహిరిలో లాంటి సూపర్ హిట్ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన దర్శకుడు వైవిఎస్ చౌదరి. సీనియర్ ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానం ఉన్న ఈ దర్శకుడు..నందమూరి ఫ్యామిలీతో ఎన్నో సినిమాలు చేశారు. అంతేకాకుండా మహేష్ బాబుతో యువరాజు సినిమా కూడా చేశారు. ఇక ప్రస్తుతం స్టార్ హీరోగా కొనసాగుతున్న రామ్ కూడా దేవదాసు సినిమాతో లాంచ్ చేశారు.
కానీ కొద్ది సంవత్సరాల క్రితం ఈ దర్శకుడికి వరస అపజయాలు రావడం మొదలయ్యాయి. ముఖ్యంగా మంచి విష్ణు హీరోగా చేసిన సలీం సినిమా ఘోరమైన పరాజయం చవిచూసింది. ఆ తరువాత సాయి ధరమ్ తో చేసిన రేయి సినిమా అసలు ఎప్పుడు విడుదల అయిందో కూడా ఎవరికి తెలియకుండా పోయింది. ఈ క్రమంలో కొద్ది రోజుల పాటు తెలుగు సినిమాలకు గ్యాప్ ఇచ్చారు ఈ డైరెక్టర్.
9 సంవత్సరాల నుంచి సినిమాలకు దూరంగా ఉన్న ఏ దర్శకుడు త్వరలోనే మళ్ళీ ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నందమూరి హరికృష్ణ మనవడు.. నందమూరి జానకి రామ్ తనయుడు నందమూరి తారక రామారావును.. ఈ డైరెక్టర్ హీరోగా పరిచయం చేస్తూ సినిమా తీయబోతున్నట్టు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ నేపథ్యంలో.. ఈ సినిమా ఈవెంట్ లో.. వైవిఎస్ చౌదరి భార్య కూడా మళ్ళీ చాలా రోజుల తర్వాత కనపడటంతో ఆమె కాస్త వైరల్ గా మారింది. కాగా వైవిఎస్ చౌదరి భార్య గీత గతంలో పలు సినిమాల్లో నటించింది.
నాగార్జున సూపర్ హిట్ సినిమా.. నిన్నే పెళ్లాడతాలో.. వైవిఎస్ చౌదరి భార్య.. గీత నాగార్జున చెల్లెలి పాత్రలో నటించింది. అంతేకాకుండా ఆ తరువాత.. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన సింధూరం సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. ఆ తర్వాత కూడా ఎన్నో చిత్రాలలో నటించిన గీత.. వైవిఎస్ చౌదరిని పెళ్లి చేసుకుంది. కాగా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన నిన్నే పెళ్లాడతా సినిమాకు వైవిఎస్ చౌదరి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసారు. ఆ సమయంలోనే గీతతో.. ఈ దర్శకుడికి పరిచయం అయి ప్రేమగా మారింది. అయితే మొదట్లో క్యాస్ట్‌లు వేరవడంతో పేరెంట్స్ ఒప్పుకోకపోయినా తర్వాత ఒప్పించి.. వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.
ఇక ప్రస్తుతం ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కాగా పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైపోయిన గీత.. ఇప్పుడు వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో రాబోతున్న సినిమాకు..నిర్మాతగా మారింది. ప్రస్తుతం హరికృష్ణ మనవడితో వైవీఎస్ చౌదరి చేస్తున్న సినిమాని ..గీత సొంతంగా నిర్మిస్తుంది. న్యూ ట్యాలెంట్ రోర్స్@(NTR@) అనే కొత్త బ్యానర్ స్థాపించి.. ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది గీత.
Read more: Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..
Read more: Snakes venom: ఈ మొక్కలతో పాము విషం బలాదూర్.. ఇలా పెంచుకోవాలంటున్న నిపుణులు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter