Nindu Noorella Savasam: సీరియల్స్ ఇష్టపడే ప్రేక్షకులకు జీ తెలుగు ఎప్పుడు ముందంజలో ఉంటుంది. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునే వైవిద్యమైన కథలతో కొత్త సీరియల్ చూస్తూ ఉంటుంది జీ తెలుగు. కాగా ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ తో ప్రేక్షకులను అలరించే జీ తెలుగు ఛానల్ అందిస్తున్న సూపర్ హిట్ సీరియల్ నిండు నూరేళ్ల సావాసం. మొదటి ఎపిసోడ్ నుంచే అశేష ప్రేక్షకాదరణతో సక్సెస్ఫుల్ గా కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ గురువారంతో 100 ఎపిసోడ్స్ పూర్తిచేసుకోబోతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అద్భుతమైన నటీనటులు, ఆసక్తికరమైన కథాంశంతో ప్రేక్షకులను అలరిస్తున్న నిండు నూరేళ్ల సావాసం, సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు రాత్రి 7 గంటలకు, మీ జీ తెలుగులో ప్రసారమవుతుంది.
కాగా జీ తెలుగు మోస్ట్ పాపులర్ సీరియల్ గా నిలిచిన నిండు నూరెళ్ల సవాసంకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో విలక్షణమైన కథాంశం, ప్రతిభావంతులైన నటీనటులు, సిబ్బందితో వచ్చిన ఈ సీరియల్ 100 ఎపిసోడ్లు పూర్తి చేసుకోబోతోంది. 


వంద ఎపిసోడ్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సీరియల్లో ప్రతినాయకిగా ఆకట్టుకుంటున్న మహేశ్వరి స్థానంలో నవ్య రావు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ వారం నుంచి మనోహరి పాత్రలో నవ్య రావు అభిమానులను అలరించనుంది. నవ్య అద్భుతమైన నటనా సామర్ధ్యం నిస్సందేహంగా ప్రేక్షకులను ఆకట్టుస్తుందనడంలో సందేహం లేదు.


నిండు నూరేళ్ల సావాసంలో ప్రతినాయకి పాత్రలో నటించడంపై నవ్య మాట్లాడుతూ.. ‘నిండు నూరేళ్ల సవాసం నటీనటులతో, సిబ్బందితో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా, ఉత్సాహంగా ఉంది. ఈ సీరియల్ యొక్క ప్రత్యేకమైన కథాంశం నన్నెంతగానో ఆకట్టుకుంది. ఈ కథలో తర్వాత ఏం జరగబోతుందోనని తెలుసుకునేందుకు ప్రేక్షకులతోపాటు నేనూ ఆసక్తిగా ఎదురు చూస్తుంటా. ఈ సీరియల్ ద్వారా ప్రేక్షకులను అలరించే  అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. మనోహరి పాత్రలో నన్ను చూసి ప్రేక్షకుల నుంచి  వచ్చే స్పందన తెలుసుకునేందుకు చాలా ఆసక్తిగా ఉన్నాను’ అన్నారు.


Also Read: Telangana Election 2023 Result Live: బీజేపీ విజయం సాధించిన స్థానాలు ఇవే.. కీలక నేతలు ఓటమిపాలు 


 


Also read: Telangana Election Results 2023: తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమికి కారణాలేంటి


 


 


 



 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook