Zee Telugu Ummadi Kutumbam: ఆసక్తికరమైన మలుపులు, ఆకట్టుకునే కథలతో సాగే సీరియల్స్ అందిస్తున్న.. జీ తెలుగు మరో సరికొత్త  సీరియల్ను.. తన అభిమాన వీక్షకులకు అందించేందుకు సిద్ధమైంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం, అనురాగాల నేపథ్యంలో సాగే ఆసక్తికరమైన కథ, కథనంతో రూపొందుతున్న సరికొత్త సీరియల్ ‘ఉమ్మడి కుటుంబం’. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సీరియల్లో ఉమ్మడి కుటుంబం విశిష్టత, ప్రాధాన్యం, కుటుంబ సభ్యుల మధ్యనున్న అనుబంధం, ప్రేమ, బాధ్యతలు, అనురాగాలను కొత్తకోణంలో చూపించనున్నారు. ఆకట్టుకునే కథతో.. రానున్న ‘ఉమ్మడి కుటుంబం’ నవంబర్ 4న ప్రారంభం, సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఈ సీరియల్ ని ప్రసారం చేయనున్నారు. 


కుటుంబమే మొదటి ప్రాధాన్యతగా జీవిస్తున్న ఆనంద భైరవి(రూప) తన కొడుకు కోసం తగిన వధువుని వెతుకుతుంది.  సౌమ్యత, గౌరవం కలబోసినట్లున్న శరణ్య(సాక్షి)ను తన కొడుక్కి తగిన భాగస్వామిగా నమ్ముతుంది ఆనంద. శరణ్య సోదరి అనన్య (సుస్మిత) అందుకు పూర్తి భిన్నంగా ఆలోచిస్తూ స్వేచ్ఛయుత జీవనాన్ని ఇష్టపడుతుంది. ఆనంద కుటుంబంలోకి అనన్య ఎలా ప్రవేశిస్తుంది? శరణ్య జీవితంలో ప్రతినాయకి ఎవరు? అనే విషయాలు తెలుసుకోవాలంటే ఉమ్మడి కుటుంబం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!


రూప (ఆనంద), యశ్వంత్ (దర్శన్), సాక్షి (శరణ్య) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సీరియల్లో కరమ్ (రోహిత్), సుస్మిత (అనన్య) కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అన్నదమ్ములు, తోడికోడళ్ల  అనుబంధం, అసూయ, ప్రతీకారం ముఖ్యాంశాలుగా ఆసక్తికరంగా సాగే ఉమ్మడి కుటుంబం సీరియల్ సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమవుతుంది..


జీ తెలుగు అందిస్తున్న కొత్త సీరియల్ 'ఉమ్మడి కుటుంబం' ప్రారంభంతో.. ప్రస్తుతం ఉన్న ఇతర సీరియళ్ల ప్రసార సమయాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి. మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమవుతున్న సీతా రామ ఇక నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రసారమవుతుంది. చాలాకాలంగా జీ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న సూర్యకాంతం సీరియల్ ముగియనుంది. ప్రేక్షకులు ప్రసార సమయాల్లో మార్పుని గమనించి కొత్త సీరియల్ ఉమ్మడి కుటుంబంతోపాటు మీ అభిమాన సీరియల్స్ మిస్ కాకుండా చూసేయండి!


Read more: Baba Siddique: బాబా సిద్ధీఖీ ఎవరు?... ఎన్సీపీ నేత హత్యకు నెల రోజుల ముందు నుంచి అంత జరిగిందా..?.. వెలుగులోకి విస్తుపోయే విషయాలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.