ZEE5 Paruvu Original Series: నాగబాబు ముఖ్యపాత్రలో జీ5 ‘పరువు’ ఒరిజినల్ సిరీస్.. ట్రైలర్ విడుదల చేసిన వరుణ్ తేజ్..
ZEE5 Paruvu Original Series: మెగా బ్రదర్ నాగబాబు ముఖ్యపాత్రలో నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ పరవు. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై విష్ణు ప్రసాద్ లగ్గిశెట్టి, సుస్మిత కొణిదెల నిర్మించిన ZEE5 ఒరిజినల్ సిరీస్ ట్రైలర్ ను వరుణ్ తేజ్ విడుదల చేసారు.
ZEE5 Paruvu Original Series: మెగా బ్రదర్ నాగబాబు ఇప్పటికే స్మాల్ స్క్రీన్ పై జబర్దస్త్ కామెడీ వంటి రియాలిటీ షోలకు జడ్జ్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే కదా. ఆ తర్వాత సొంతంగా ఓ యూట్యూబ్ ఛానెల్ ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సంగతి పక్కన పెడితే.. మొన్నటి వరకు ఎలక్షన్ హడావుడిలో బిజీగా ఉన్న మెగా బ్రదర్.. ఇపుడు పరువు పేరుతో ఓ వెబ్ సిరీస్ లో నటించాడు. తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ను ఆయన తనయుడు వరుణ్ తేజ్ విడుదల చేసాడు. సిద్దార్థ్ నాయుడు, వడ్లపాటి రాజశేఖర్ ఈ చిత్రానికి దర్శకులు. ఈ వెబ్ సిరీస్ నాగబాబుతో పాటు నివేదా పేతురాజ్, నరేష్ అగస్త్య, ప్రణీత పట్నాయక్, బిందు మాధవి, అమిత్ తివారి వంటి వారు లీడ్ రోల్స్ లో నటించారు. పవన్ సాధినేని షో రన్నర్‌గా రాబోతోన్న ఈ ZEE5 ఒరిజినల్ సిరీస్ జూన్ 14 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. మొదటి ఎపిసోడ్‌ను ను ఫ్రీగా చూడొచ్చు.
ఇక ఈ ట్రైలర్‌ను చూస్తుంటే పరువు అనే టైటిల్ ఎందుకు పెట్టారో క్లిష్టల్ క్లియర్ గా అందరికీ అర్ధమయ్యేలా కట్ చేసారు. ఓ ప్రేమ జంట, కులాలు అడ్డు రావడం, పారిపోయి పెళ్లి చేసుకోవడం, పరువు కోసం పేరెంట్స్ ఎలాంటి ప్రయత్నాలు చేసారనేది పరువు ట్రైలర్ చేస్తుంటే తెలుస్తోంది. ముఖ్యంగా ఆ జంటకు ఎదురైన కష్టాలు ఇలా అన్నింటిని ఎంతో ఉత్కంఠభరితంగా ఈ ట్రైలర్‌లో చూపించారు.
మరోవైపు పరువు కోసం హత్యలు.. మరోవైుప కారు డిక్కీలో ఉన్న శవం ? మర్డర్ కేస్ ? పరువు హత్యకు గురవుతామని భయపడ్డ వాళ్లే.. ఓ హత్యను చేయడంతో ఎదురైన కష్టాలు ఏమిటనేది ? ఇందులో చూపించబోతున్నాడు. వాటి నుంచి ఎలా బయటపడ్డారు? ఇలా ట్విస్టులతో ఈ ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది.
బిందు మాధవి ట్రైలర్ చివర్లో ఎంట్రీ ఇవ్వడం, నివేదా పేతురాజ్ బిందు మాధవి మధ్య వచ్చే సీన్ అదిరిపోయాయి. ఇక నాగబాబు చాలా రోజులకు ఓ సీరియస్ రోల్లో కనిపించబోతున్నాడు. శ్రావణ్ భరద్వాజ్ ఆర్ఆర్ బాగుంది. విద్యా సాగర్ సినిమాటోగ్రఫీ నాచురల్గ గుంది.
జీ 5 ఓటీటీ గురించి
జీ5 భారతదేశపు యంగస్ట్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్. మల్టీ లాంగ్వేజెస్ తో ప్రేక్షకులను అలరిస్తోంది. గ్లోబల్ కంటెంట్ పవర్ హౌస్ జీ ఎంటర్‌టైన్‌మెంట్ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తోంది. జీ5 అత్యద్భుతమైన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ గా పేరు తెచ్చుకుంది. 3,500 సినిమాల లైబ్రరీ ఉన్న అతిపెద్ద ప్లాట్‌ఫార్మ్ ఇది. 1,750 టీవీ షోలు, 700 ఒరిజినల్స్, 5 లక్షలకు పైగా ఆన్ డిమాండ్ కంటెంట్ ఈ సంస్థ సొంతం. అంతేకాదు 12 భాషల్లో (హిందీ, ఇంగ్లిష్, బెంగాలీ, మలయాళం, తెలుగు, తమిళ్, మరాఠీ, ఒరియా, భోజ్‌పురి, గుజరాతీ, పంజాబీ)లో అందుబాటులో ఉంది. బెస్ట్ ఒరిజినల్స్, ఇంటర్నేషనల్ మూవీస్, టీవీ షోస్, మ్యూజిక్, కిడ్స్ షోస్, ఎడ్‌టెక్, సినీ ప్లేస్, న్యూస్, లైవ్ టీవీ, హెల్త్, లైఫ్‌స్టైల్ విభాగాల్లో ప్రేక్షకులను అలరిస్తోంది. ఇంత గొప్ప డీప్ టెక్ స్టాక్ నుంచి ఎదిగిన ప్లాట్‌పార్మ్ కావడంతో జీ5 ఇపుడు 12 భాషల్లో అత్యద్భుతమైన కంటెంట్‌తో ఆడియన్స్ ను అలరిస్తోంది.
ఇందులో నాగబాబుతో పాటు నరేష్ అగస్త్య, నివేదా పేతురాజ్, రమేష్, సునిల్ కొమ్మిశెట్టి, ప్రణీత పట్నాయక్, రాజ్ కుమార్ కసిరెడ్డి, మోయిన్, అమిత్ తివారి, అనిల్ తేజ, బిందు చంద్రమౌళి, అఖిలేష్, బోస్ అన్నియ్య, రవితేజ మహాదాస్యం, మాధవి, సంతోష్ నందివడ తదితరులున్నారు. షో రన్నర్: పవన్ సాదినేని, ప్రొడక్షన్ డిజైనర్ - నార్ని శ్రీనివాస్, ఎడిటర్ - విప్లస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - పొట్ల లక్ష్మీ శరణ్య, పి.ఆర్.ఒ- బియాండ్ మీడియా నాయుడు సురేంద్ర కుమార్ - ఫణి కందుకూరి. బ్యానర్స్- గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాతలు - విష్ణు ప్రసాద్ లగ్గిశెట్టి, సుస్మిత కొణిదెల, దర్శకత్వం - సిద్దార్థ్ నాయుడు, వడ్లపాటి రాజశేఖర్, మాటలు,రచయిత - సిద్దార్థ్ నాయుడు, సినిమాటోగ్రఫీ - చింతా విద్యా సాగర్, మ్యూజిక్ డైరెక్టర్ - శ్రవణ్ భరద్వాజ్.
Also read: Toll Fee Hike: ఇవాళ అర్ధరాత్రి నుంచి టోల్ ధరల బాదుడు, 5 శాతం పెరిగిన ఫీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook