Bheemla Nayak - RRR Updates: అనారోగ్య సమస్యలతో కన్నుమూసిన పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రముఖులు నివాళులు అర్పించారు. ఆయన భౌతికకాయాన్ని బుధవారం ఫిలిం ఛాంబర్ కు తరలించి.. సందర్శనార్థం అక్కడ ఉంచారు. ఈ నేపథ్యంలో పలువురు నటీనటులు ఆయన పార్థీవ దేహాన్ని సందర్శించి భావోద్వేగానికి లోనయ్యారు. మరోవైపు సిరివెన్నెల సీతారామశాస్త్రికి మృతి కారణంగా కొన్ని సినిమా అప్డేట్స్ రిలీజ్ ను ఆపేస్తున్నట్లు ఆయా చిత్ర నిర్మాణసంస్థలు వెల్లడించాయి. సిరివెన్నెలకు గౌరవార్థం తమ చిత్రాల ప్రమోషన్ కార్యక్రమాలను ఆపేస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భీమ్లా నాయక్ సాంగ్ రిలీజ్ వాయిదా..


పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ ‘భీమ్లా నాయక్’. సంక్రాంతి కానుకగా జనవరి 12న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్స్ జోరుగా కొనసాగిస్తున్నారు మేకర్స్. ఈ సినిమా నుంచి భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్, ‘లాలా భీమ్లా..’ తర్వాత ఈ పాట ఫ్యాన్ ను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. అంతకు ముందు పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి పాత్రలకు సంబంధించిన గ్లింప్స్ ఇటీవలే విడుదలై.. ఫ్యాన్స్ లో సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి.


ఈ నేపథ్యంలో డిసెంబరు 1న ‘అడవి తల్లి మాట’ అనే సాంగ్ రిలీజ్ కావాల్సి ఉంది. అయితే పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అనూహ్య మరణం కారణంగా పాట రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ట్విట్టర్ లో ప్రకటించారు. 



‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ రిలీజ్ వాయిదా..


దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఇందులో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమురం భీమ్ గా ఎన్టీఆర్ నటించారు. అలియా భట్, ఒలివియా మోరిస్ కథానాయికలు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో చిత్ర ట్రైలర్ ను డిసెంబరు 3న విడుదల చేయాల్సి ఉంది. అయితే సిరివెన్నెల మరణం కారణంగా ట్రైలర్ రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రం జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదలకానుంది.



Also Read: Sirivennela Sitaramasastry's favourite songs: సిరివెన్నెల సీతారామ శాస్త్రికి నచ్చిన రచయిత, వారి పాటలు


ALso Read: Sirivennala: ఫిలిం ఛాంబర్‌కు చేరుకున్న సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివ దేహం  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook