Sirivennela Sitaramasastry's favourite songs: సిరివెన్నెల సీతారామ శాస్త్రికి నచ్చిన రచయిత, వారి పాటలు

Sirivennela Sitaramasastry's favourite songs and writers: సిరివెన్నెల సీతారామ శాస్త్రి అంటేనే అద్భుతమైన సాహిత్యానికి పెట్టింది పేరు. లక్ష్యాన్ని చేరుకోవడానికి స్పూర్తినిచ్చే గీతాలెన్నో ఆయన కలం నుంచి జాలువారాయి. గుండెల నిండా ధైర్యం నింపే తెగువను నేర్పే పాటలెన్నో రాసి లోకాన్ని వెన్నుతట్టి ప్రోత్సహించారు. ప్రేమ, ధైర్యం, నీతి-నిజాయితీ, స్పూర్తి, కీర్తి, మంచి-చెడు, అవినీతి, ప్రశ్నించే తత్వం, చావు-పుట్టుకలు.. ఇలా ఒకటేమిటి.. ఒక్క బూతు పాటలు తప్ప ఆయన స్పృశించని కోణం లేదు.

Written by - Pavan | Last Updated : Nov 30, 2021, 09:46 PM IST
Sirivennela Sitaramasastry's favourite songs: సిరివెన్నెల సీతారామ శాస్త్రికి నచ్చిన రచయిత, వారి పాటలు

Sirivennela Sitaramasastry's favourite songs and writers: సిరివెన్నెల సీతారామ శాస్త్రి అంటేనే అద్భుతమైన సాహిత్యానికి పెట్టింది పేరు. లక్ష్యాన్ని చేరుకోవడానికి స్పూర్తినిచ్చే గీతాలెన్నో ఆయన కలం నుంచి జాలువారాయి. గుండెల నిండా ధైర్యం నింపే తెగువను నేర్పే పాటలెన్నో రాసి లోకాన్ని వెన్నుతట్టి ప్రోత్సహించారు. ప్రేమ, ధైర్యం, నీతి-నిజాయితీ, స్పూర్తి, కీర్తి, మంచి-చెడు, అవినీతి, ప్రశ్నించే తత్వం, చావు-పుట్టుకలు.. ఇలా ఒకటేమిటి.. ఒక్క బూతు పాటలు తప్ప ఆయన స్పృశించని కోణం లేదు. 

సిరివెన్నెల సీతారామ శాస్త్రి 'అంతటి ప్రతిభావంతులు' అని ఒక్క ముక్కలో చెప్పుకుంటే అది ఆయన్ని అనమానించడమే అవుతుంది. ఎందుకంటే ఆయన కీర్తి ఎనలేనిది. ఆయన ఇచ్చిన స్పూర్తి మరువలేనిది. అంత గొప్ప గేయ రచయితకు బాగా నచ్చిన మరో రచయిత ఎవరు, వాళ్లు అంటే ఆయనకు ఎందుకు ఇష్టం అనే సందేహాలు మనలో చాలా మందికి కలగక మానవు. ఆ ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం.

గతంలో ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి మాట్లాడుతుండగా ఆయనకి ఇష్టమైన రచయిత ఎవరు అనే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి వచ్చింది. ఈ సందర్భంగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి స్పందిస్తూ.. తనదైన తత్వదృష్టి కోణంతో చూస్తే.. తనకు ఒక్క విశ్వనాథ సత్యనారాయణ తప్ప తనలా ఇంకెవ్వరూ ఇష్టం అనిపించలేదని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు. 

Also read : Chiranjeevi : సాహిత్యానికి చీకటి రోజు.. సిరివెన్నెల మరణంపై చిరంజీవి స్పందన

అయితే, అదే సమయంలో ప్రతిభపరంగా ఆలోచిస్తే.. దేవులపల్లి కృష్ణ శాస్త్రి, వేటూరి సుందర రామ్మూర్తి, మామూలు పదాలను కూడా అత్యంత తియ్యగా అనిపించేలా పదాలు రాయడంలో సి నారాయణ రెడ్డిని మించిన వాళ్లు ఎవరు ఉంటారు అని చెప్పుకొచ్చారు. అలాగే తక్కువ పరిమితులతోనే చాలా బాగా పాటలు రాయడంలో అనంత శ్రీరామ్ శైలిని సిరివెన్నెల అభినందించారు. హరిరామ జోగయ్య శాస్త్రి, చంద్రబోస్ రాసిన పాటలు కూడా తనకు నచ్చాయని గుర్తుచేసుకున్నారు. చంద్రబోస్ (Lyricist Chandrabose) పేరును ప్రస్తావిస్తూ.. జూనియర్ ఎన్టీఆర్, కీర్తి చావ్లా జంటగా నటించిన ఆది సినిమాలోని '' నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది ఇవ్వొద్దు.. ఇవ్వొద్దు '' అనే పాటను గుర్తుచేసుకున్నారు. అలాంటి పాటలు రాసిన వారిని అభినందించకుండా ఎలా ఉంటాం అని సిరివెన్నెల సీతారామ శాస్త్రి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

ఇక్కడ సిరివెన్నెల సీతారామ శాస్త్రి ప్రత్యేకంగా చెప్పుకొచ్చిన వ్యక్తి మరొకరు కూడా ఉన్నారు. ఆయన ఎవరో కాదు.. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ (Sirivennela Sitaramasastry about Devisri Prasad). అదేంటి ఆయన మ్యూజిక్ మాత్రమే కంపోజ్ చేస్తారు కదా.. మరి ఇక్కడ రచయితల పేర్లలో ఆయన పేరు ఎందుకు వచ్చిందనే సందేహం మీకు రావొచ్చేమో!! అయితే మీకు గబ్బర్ సింగ్ మూవీలోని '' గన్నులాంటి కన్నులున్న జున్నులాంటి పిల్లా..'' పాట గుర్తుంది కదా! ఎందుకు గుర్తుండదులెండి.. ఎందుకంటే కుర్రకారును ఓ ఊపు ఊపిన పాట అది. 

Also read : Sirivennela: చేంబోలు సీతారామశాస్త్రి సిరివెన్నెల సీతారామశాస్త్రిగా ఎలా మారారు?

' గన్నులాంటి కన్నులున్న జున్నులాంటి పిల్లా..' పాటను రాసింది ఎవరో తెలుసు కదా.. దేవి శ్రీ ప్రసాదే. సిరివెన్నెల సీతారామ శాస్త్రి (Sirivennela Sitaramasastry family background) ఆ పాట విన్నాకా అర్థరాత్రే దేవీశ్రీ ప్రసాద్‌కి ఫోన్ చేసి అభినందించారట. తనకు ఏదైనా నచ్చితే వారికి ఫోన్ చేసి అభినందిస్తాను అని సిరివెన్నెల సీతారామ శాస్త్రి గుర్తుచేసుకున్నారు.

Also read : Sirivennela Seetharama Sastry : సిరివెన్నెల చనిపోవడానికి కారణాలివే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

More Stories

Trending News