కొత్త ఏడాదికి షాకింగ్ న్యూస్ వినాల్సి వస్తోంది. బాలీవుడ్ దిగ్గజ నటుడు ఖాదర్ ఖాన్ (81) తుదిశ్వాస విడిచారు. సుదీర్ఘ కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఖాదర్ ఖాన్ ...నిన్న సాయంత్రం 6 గంటలకు కన్నుమూత మూసినట్లు తెలిసింది.  కెనడాలోని తన కుమారుడు సర్ఫరాజ్ ఖాన్ వద్ద వృద్ధాప్యాన్ని ఖాదర్ ఖాన్.. స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గత  కొంత కాలంగా శ్వాసకోశ సమస్యలతో ఆయన బాధపడుతూ తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. కాగా ఖాదర్ ఖాన్ అంత్యక్రియలు కెనడాలోనే నిర్వహిస్తున్నట్లు ఆయన కుమారుడు సర్ఫరాజ్ ఖాన్ వెల్లడించారు


1937 కాబూల్ లో జన్మించిన ఖాదర్ ఖాన్ 1973లో తొలి చిత్రం 'దాగ్' లో నటించారు. అప్పటి నుంచి సీనీ కెరీర్ ప్రాంభించిన ఆయన ఇక వెనుదిరగలేదు. దాదాపు 300 చిత్రాల్లో విభిన్న పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. అంతే కాదు.. 250 సినిమాలకు రచయిత వ్యవహించారు. ఇలా సినీ రంగంలో తనదైన ముద్ర వేసుకొన్న ఖదార్ ఖాన్..అన్నివర్గాల ప్రేక్షకుల ఆధారాభిమానాలను చురగొన్నారు. ఖాదర్ లేరనే విషయాన్ని బాలీవుడ్ అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.