ముంబై: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్ (Sushant Singh Rajput)‌  ఇంట మరో విషాదం చోటుచేసుకుంది. ఓ వైపు ముంబైలోని శ్మశానవాటికలో సోమవారం సుశాంత్‌ అంత్యక్రియలు జరుగుతుండగా, బిహార్‌లోని పూర్ణియాలో అతడి వదిన(కసిన్‌ బ్రదర్‌ భార్య) సుధా దేవి కన్నుముశారు. సుశాంత్‌ మరణ వార్తను విన్న తర్వాత నుంచి ఆమె ఆహారం తీసుకోలేదు. సుశాంత్‌ మృతితో కుంగిపోయిన ఆమె, ఆహారం సైతం తీసుకోకపోవడంతో చనిపోయారు. సుశాంత్‌ది సూసైడ్ కాదు.. పక్కా మర్డర్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ క్రమంలో ముంబైలో సుశాంత్‌ అంత్యక్రియలకు ఆయన తండ్రి, ఇద్దరు సోదరీమణులు ముంబైకి వచ్చారు. సుశాంత్‌ అంత్యక్రియలు నిర్వహిస్తుండగా, బిహార్‌లోని పూర్ణియాలో సుశాంత్ వదిన సుధా దేవి (Sushant Singh Rajput Sister In Law Passes Away)  కన్నుమూశారు. దీంతో వీరి కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. సుశాంత్ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్న తరుణంలో కుటుంబంలో మరో వ్యక్తి చనిపోవడం వారిని కలచివేస్తోంది. ‘సుశాంత్ నుంచి ఇలాంటి ఫినిష్ ఊహించలేదు’


నటీమణులు కృతీసనన్‌, రియా చక్రవర్తి, శ్రద్ధాకపూర్‌, ఫిల్మ్‌ మేకర్‌ అభిషేక్‌ కపూర్‌, నిర్మాత ఎక్తా కపూర్‌, నటులు వివేక్‌ ఒబేరాయ్‌, రణదీప్‌ హుడా, ప్రతీక్‌ బబ్బర్‌, సింగర్‌ ఉదిత్‌ నారాయ్‌‍ పవన్‌ హాన్స్‌ శ్మశాన వాటికల్‌ జరిగిన సుశాంత్‌ అంత్యక్రియల (Sushant Singh Rajput Last Rites)కు హాజరైన వారిలో ఉన్నారు. కాగా, ఆదివారం ఉదయం ముంబైలోని తన బాంద్రా నివాసంలో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
మిస్ దివా విన్నర్, నటి ఫొటో గ్యాలరీ