నిహారిక పెళ్లి ఫిక్స్.. క్లారిటీ అడుగుతున్న నెటిజన్లు
Niharika Wedding | మెగా డాటర్ నిహారిక త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అందుకు నటి నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ కారణం. మిస్ నుంచి మిస్సెస్ కాబోతున్నట్లు హింట్ ఇవ్వడం పలు ప్రశ్నలకు దారి తీసింది.
Niharika Konidela Wedding | టాలీవుడ్‌లో పెళ్లి గురించి చర్చ జరిగిందంటే మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela) టాపిక్ కచ్చితంగా వస్తుంది. వెబ్‌సిరీస్‌లు చేస్తూనే కొన్ని షోలకు హోస్ట్‌గా ఆకట్టుకుంది. నటిగానూ తనదైన మార్క్ చేసిన నిహారిక త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతోంది. స్వయంగా నటి నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ఈ హింట్ ఇచ్చింది. ఎటు చూసినా ‘సంతోష్ బాబు అమర్ రహే’ నినాదాలు
ఇక మిస్ కాదని మిస్సెస్ కాబోతున్నట్లు తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టుతో నిహారిక పెళ్లి (Niharika Konidela Marriage) విషయాన్ని చెప్పకనే చెప్పింది. అయితే స్పష్టత కావాలంటూ మెగా అభిమానులు సోషల్ మీడియాలో కోరుతున్నారు. కొందరైతే కంగ్రాట్స్ చెప్పేస్తున్నారు. ఏదేమైనా గత కొన్ని నెలలుగా నిహారిక పెళ్లి విషయం టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అవుతోందని తెలిసిందే. బికినీలో సన్నీలియోన్ Photos వైరల్
కాగా, గతంలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌తో నిహారిక పెళ్లి జరిపిస్తారని ప్రచారం జరగగా.. ఈ వదంతులకు ఇద్దరూ చెక్ పెట్టారు. ఆ తర్వాత టాలీవుడ్ బాహుబలి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో నిహారిక పెళ్లి ఫిక్సయిందంటూ మరోసారి వైరల్ అయింది. ఇలాంటివేమీ నిజం కాదని తేలిపోయింది. అయితే నిహారిక తాజా సోషల్ మీడియా పోస్ట్ సినిమా ప్రమోషన్ అని భావించే వారు సైతం ఉన్నారు. నిహారిక ఇన్‌స్టాగ్రామ్ పెళ్లి పోస్టుపై త్వరలోనే స్పష్టత రానుంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
మిస్ దివా విన్నర్, నటి ఫొటో గ్యాలరీ