Adivi Sesh HIT 2 Collections : అడివి శేష్ సినిమా సినిమాకు తన మార్కెట్ పెంచుకుంటూ పోతోన్నాడు. సినిమా సినిమాకు తన స్టార్డం పెరుగుతూనే వస్తోంది. మేజర్ సినిమాతో అందరినీ మెప్పించిన అడివి శేష్.. ఇప్పుడు హిట్ సెకండ్ కేస్ అంటూ రాబోతోన్నాడు. మొదటి కేస్‌లో విశ్వక్ సేన్ అదరగొట్టేశాడు. అయితే ఈ రెండో కేస్‌లో అడివి శేష్‌ను కొత్త యాంగిల్‌లో చూపించేశాడు శైలేష్ కొలను. ఇప్పటికే టీజర్, ట్రైలర్ అన్నీ కూడా అంచనాలు పెంచేశాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డిసెంబర్ 2న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 10.25కోట్లు, ఓవర్సీస్‌లో 2.5కోట్లు, కర్ణాటక రెస్టాప్ ఇండియాలో 1.5కోట్లకు అమ్ముడుపోయింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా పద్నాలుగు కోట్లకు అమ్ముడుపోగా.. పదిహేను కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగబోతోంది.


అయితే హిట్ సెకండ్ కేస్ సినిమాకు ఓవర్సీస్‌లో మంచి మార్కెట్ ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రీమియర్స్, అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే ఈ చిత్రానికి రెండు లక్షల డాలర్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఇలా అడివి శేష్ సినిమాలకు ఓవర్సీస్‌లో మంచి మార్కెట్ ఉందని మరోసారి హిట్ సెకండ్ కేస్ నిరూపిస్తోంది.


ఒక వేళ ఈ సినిమాకు కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ఈ వీకెండ్ దుమ్ములేపేస్తుందన్న మాట. ఈ వారం పోటీలో కూడా పెద్ద సినిమాలేవీ లేకపోవడం, రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున రిలీజ్ అవుతుండటంతో హిట్ సెకండ్ కేస్‌కు చాలానే కలిసి వచ్చేట్టు కనిపిస్తోంది.


నాని నిర్మాతగా మంచి సక్సెస్ రాబోతోన్నట్టుగా కనిపిస్తోంది. మొదటి పార్ట్ బాగానే కలిసి వచ్చింది. ఇక ఇప్పుడు సెకండ్ కేస్ కూడా బాగానే కలిసి వచ్చేట్టు ఉంది. మరి ఈ సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది? ఎలాంటి టాక్ వస్తుంది? నిర్మాతగా నాని ఎంత లాభం పొందుతాడన్నది చూడాలి.


Also Read : Nara Brahmani Bike Riding : బాలయ్య కూతురా? మజాకా?.. బైక్ రైడర్‌గా నారా బ్రహ్మణి యాత్ర


Also Read : Pawan Kalyan Son Akira Nandan : గడ్డం, మీసంతో అకిరా నందన్.. అదిరిన లుక్.. కానీ అదే నిరాశపర్చే విషయం


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook