Pawan Kalyan Son Akira Nandan : గడ్డం, మీసంతో అకిరా నందన్.. అదిరిన లుక్.. కానీ అదే నిరాశపర్చే విషయం

Pawan Kalyan Son Akira Nandan పవన్ కళ్యాణ్ తనయుడిగా అకిరా నందన్‌కు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. జూనియర్ పవర్ స్టార్ అంటూ ఫ్యాన్స్ తెగ హంగామా చేస్తుంటారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 30, 2022, 08:09 PM IST
  • నెట్టింట్లో అకిరా నందన్ లుక్
  • అకిరా, ఆద్య వీడియోను షేర్ చేసిన రేణూ దేశాయ్
  • జూనియర్ పవర్ స్టార్ అంటూ ఫ్యాన్స్ హంగామా
Pawan Kalyan Son Akira Nandan : గడ్డం, మీసంతో అకిరా నందన్.. అదిరిన లుక్.. కానీ అదే నిరాశపర్చే విషయం

Pawan Kalyan Son Akira Nandan Beard Look : అకిరా నందన్‌ను పవన్ కళ్యాణ్‌ అభిమానులు అయితే జూ. పవర్ స్టార్ అంటూ పిలుస్తుంటారు. అకిరా నందన్ సినీ ఎంట్రీ గురించి ఎప్పుడూ రూమర్లు వస్తూనే ఉంటాయి. వాటిని ఆద్య ఎప్పటికప్పుడూ ఖండిస్తూనే వస్తుంది. అకిరా నందన్ ఏం అనుకుంటున్నాడో అదే చేస్తాడు.. అయితే అకిరాకు సంగీతం అంటే ఇష్టం, ఫుట్ బాల్ ఆడటం అంటే ఇష్టం, చదువుకోవడం ఇష్టం అంటూ ఇలా రేణూ దేశాయ్ పెద్దలిస్టే చెప్పేసింది.

అలా అకిరా నందన్‌ ఏం అవుతాడు అన్న దానిపై క్లారిటీ రావడం లేదు. రేణూ దేశాయ్ సైతం అకిరా నందన్‌ను ఇది అవ్వమని, అది అవ్వమని అడగదు. ప్రస్తుతం అయితే రేణూ దేశాయ్ తన కొడుకుని స్కాట్లాండ్‌లో చదువుల కోసం పంపించినట్టు తెలుస్తోంది. ఆ మధ్య అకిరా, ఆద్య, రేణూ దేశాయ్‌లు స్కాట్లాండ్‌లో కనిపించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అకిరా, ఆద్య, రేణూ దేశాయ్‌లు సందడి చేస్తున్నారు.

అకిరా నందన్‌ తాజాగా బియర్డ్ లుక్కులో కనిపించాడు. గుబురు గడ్డంతో అకిరా నందన్ కనిపించడంతో ఫ్యాన్స్ హంగామా చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అకిరా నందన్ లుక్కు మీద ఇలా కామెంట్లు వస్తాయనే ఉద్దేశ్యంతోనే రేణూ దేశాయ్ తన ఇన్ స్టాగ్రాంలో కామెంట్ల సెక్షన్‌ను డిసబుల్ చేసింది. దీంతో నెటిజన్లు ఎవ్వరూ కూడా కామెంట్లు పెట్టేందుకు వీల్లేకుండా పోయింది.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by renu desai (@renuudesai)

అకిరా నందన్ తన లుక్ పూర్తిగా కనిపించకుండా జాగ్రత్తపడ్డాడు. హుడీ వేసుకోవడంతో అకిరా నందన్ లుక్ పూర్తిగా కనిపించలేదు. అదే కాస్త నిరాశ పర్చే అంశం. కానీ మీసం, గడ్డం ఉందని మాత్రం క్లియర్‌గా కనిపిస్తోంది. దీంతో అకిరా నందన్ ఈ కొత్త లుక్ చూసి పవన్ కళ్యాణ్‌ అభిమానులు మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఆద్య,అకిరా మధ్యల ఇలా కుంగ్ ఫూ ఫైట్ జరుగుతోందంటూ రేణూ దేశాయ్ చెప్పుకొచ్చింది.

Also Read : Urfi Javed Videos : ఉర్ఫీ అర్దనగ్న ప్రదర్శన.. ఇంత చీప్‌గా దిగజారుతావా?.. వీడియోపై నెటిజన్లు ఫైర్

Also Read : Samantha South Korea Treatment : సమంత పరిస్థితి విషమం.. చికిత్స కోసం దక్షిణి కొరియాకు?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News