Music Shop Murthy Release Date: అజయ్ ఘోష్, చాందినీ చౌదరి ప్రధాన పాత్రల్లో శివ పాలడుగు దర్శకత్వంలో రూపొందిన మూవీ ‘మ్యూజిక్ షాప్ మూర్తి’. ఫ్లై హై సినిమాస్‌పై హర్ష గారపాటి, రంగారావు గారపాటి నిర్మించారు. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్‌తో మంచి క్రియేట్ అయింది. తాజాగా మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు మేకర్స్. జూన్ 14న ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించిన ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తుందని అన్నారు. మరో మూడు వారాల్లో అద్భుతమైన ఎమోషనల్ ట్రీట్‌ను ఇచ్చేందుకు రాబోతున్నట్లు తెలిపారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని చెప్పారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Google maps: కొంప ముంచిన గూగుల్ తల్లి.. హైదరాబాద్ టూరిస్టులకు ఊహించని షాక్..


ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా మ్యూజిక్ షాప్ మూర్తి మూవీ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, బేబీ, డీజే టిల్లు వంటి బ్లాక్‌బస్టర్ల సినిమాలను పంపిణీ తరువాత ఈ మూవీని రిలీజ్ చేస్తుండడంతో అంచనాలను పెంచేసింది. ఈ మూవీలో అజయ్ ఘోష్  డీజే కావాలనుకునే మ్యూజిక్ షాప్ యజమాని పాత్రను పోషించారు. చాందిని చౌదరి తన లక్ష్యాన్ని సాధించడానికి అజయ్ ఘోష్‌కు సహాయం చేసే ఇన్‌స్పైరింగ్‌ పాత్ర‌లో నటించారు. ఆమని, అమిత్ శర్మ, భాను చందర్, దయానంద్ రెడ్డి ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు శ్రీనివాస్ బెజుగం కెమెరామెన్‌గా వర్క్ చేయగా.. పవన్ మ్యూజిక్ అందించారు. బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.


నటీనటులు: అజయ్ ఘోష్, చాందిని చౌదరి, ఆమని, అమిత్ శర్మ, భాను చందర్, దయానంద్ రెడ్డి తదితరులు


టెక్నీకల్ టీమ్:


==> రైటింగ్ & డైరెక్షన్: శివ పాలడుగు 
==> ప్రొడ్యూసర్స్: హర్ష గారపాటి, రంగారావు గారపాటి 
==> సహ నిర్మాతలు: సత్య కిషోర్ బచ్చు, వంశీ ప్రసాద్ రాజా వాసిరెడ్డి, సత్యనారాయణ పాలడుగు
==> బ్యానర్: ఫ్లై హై సినిమాస్
==> మ్యూజిక్: పవన్ 
==> సాహిత్యం: మహేష్ పోలోజు & పవన్
==> కెమెరామెన్: శ్రీనివాస్ బెజుగం 
==> ఎడిటర్: బొంతల నాగేశ్వర రెడ్డి
==> కొరియోగ్రఫీ: మొయిన్ మాస్టర్
==> PRO: SR ప్రమోషన్స్ (సాయి సతీష్)


Also Read: Realme Narzo N55 Price Cut: చెప్పుల ధరకే 64MP AI కెమెరా  Realme Narzo N55 పొందండి.. డిస్కౌంట్‌ పూర్తి వివరాలు!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter