హైదరాబాద్: తెలుగు ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున భార్య, యానిమల్ లవర్ అమలకు రైతులు ఫిదా అయ్యారు. లాక్ డౌన్ ప్రభావం వల్ల దిగాలుగా ఉన్న రైతన్నలను ఆదుకునేందుకు ఆమె ముందుకొచ్చారు. రైతుల పట్ల సహృదయతను ప్రదర్శించారు. ఇందులో భాగంగా రైతులకు రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలోని పాపిరెడ్డిగూడ గ్రామంలో మొత్తం 650 మంది రైతులకు విత్తనాలు అందించారు. ఒక్కొక్క రైతుకు 4 కిలోల విత్తనాలు పంపిణీ చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Also Read: పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదికి కరోనా పాజిటివ్


అంతేకాకుండా ఓ రైతు ఈ విత్తనాలతో ఎకరం మేర కంది పంట వేసుకోవచ్చని అమల తెలిపారు. నైరుతి రుతుపవనాలు సకాలంలో వచ్చి మంచి వర్షపాతం ఇస్తున్న ఈ సమయంలో రైతులకు తోడ్పాటు అందించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. లాక్ డౌన్ ప్రభావం నుంచి రైతులు కోలుకునేందుకు నాగార్జున సహకారంతో రైతులకు అందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని అమల వెల్లడించారు.


జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..