Shahid Afridi Tests COVID19 Positive | పాకిస్థాన్ మాజీ క్రికెటర్, విధ్వంసక ఆటగాడు షాహిద్ ఆఫ్రిది (Shahid Afridi) కరోనా వైరస్ బారిన పడ్డాడు. ఈ విషయాన్ని తానే స్వయంగా వెల్లడించాడు. గురువారం నుంచి ఒంట్లో కాస్త నలతగా ఉందని టెస్టులు చేపించుకోగా కోవిడ్19 పాజిటివ్‌గా తేలిందని ట్వీట్ చేశాడు. తాను త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని ప్రార్థించాలని కోరుతూ తనకు కరోనా పాజిటివ్ అనే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పాక్ మాజీ కెప్టెన్ ఆఫ్రిది వెల్లడించాడు. లాక్డౌన్లో బరువు పెరిగారా.. ఈ చిట్కాలు పాటిస్తే సరి
I’ve been feeling unwell since Thursday; my body had been aching badly. I’ve been tested and unfortunately I’m covid positive. Need prayers for a speedy recovery, InshaAllah #COVID19 #pandemic #hopenotout #staysafe #stayhome
— Shahid Afridi (@SAfridiOfficial) June 13, 2020